ఏసీబీ రిపోర్టు బయటపెట్టాలి సీఎంకు అమర్ డిమాండ్
posted on Dec 20, 2011 @ 9:31AM
హైదరాబాద్: సీఎం కిరణ్కుమార్ రెడ్డికి నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఏసీబీ నివేదికను బహిర్గతం చేసి మంత్రులను బర్తరఫ్ చేయాలని సీనియర్ జర్నలిస్ట్ అమర్ అన్నారు. మద్యం సిండికేట్ల వ్యవహారంలో ఆరోపణలు వస్తున్నప్పుడు వివరణ ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉందన్నారు. కాగా కాంగ్రెస్ ఎమ్మెల్యే గూడూరు నారాయణ రెడ్డి మాట్లాడుతూ ఈ వ్యవహారంలో దోషులుగా తేలేవారు ఎంతటివారు అయినా గన్పార్కు ముందు వారిని కొరడాలతో కొట్టించాలని అన్నారు.