‘ఓటింగ్’ అంశం ఇక సద్దుమణిగిందా ?
posted on Dec 12, 2012 @ 1:20PM
ముగ్గురు తెలుగు దేశం పార్టీ ఎంపి లు రాజ్య సభ లో ఎఫ్ డి ఐ ఓటింగ్ కు దూరంగా ఉన్న అంశం ఇక సద్దుమణిగినట్లేనని భావిస్తున్నారు. తనకు చెప్పే దేవేందర్ గౌడ్ ఓటింగ్ కు దూరంగా ఉన్నారని ఇప్పటికే చంద్ర బాబు నాయుడు ప్రకటించారు.
ఇక మిగిలిన సుజన చౌదరి, సుధా రాణి లు కూడా పార్టీ అధినేతకు లిఖిత పూర్వక వివరణ ఇచ్చి ఉండడంతో ఈ అంశాన్ని ఇంతటితో వదలివేయాలని పార్టీ నాయకులు గాలి ముద్దు కృష్ణమ నాయుడు, బొజ్జల గోపాల కృష్ణా రెడ్డి, సోమిరెడ్డి వంటి నేతలు చంద్ర బాబుకు సూచించినట్లు సమాచారం.
అయితే పార్టీ ని నడిపేది తలసాని, పయ్యావుల, కొత్త కోట వంటి నేతలు కాదని, పార్టీకి అధ్యక్షుడు ఉన్నారని సుజన వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. పార్టీ శ్రేణుల మనోభావాలను దృష్టిలో ఉంచుకొని నేతలు మాట్లాడినప్పుడు కొంత సంయమనం పాటించాలని చంద్ర బాబు సుజన కు సూచించినట్లు సమాచారం. అయితే, ఈ ముగ్గురు నేతలకు క్షమాపణ చెప్పాలని పార్టీ నేతలు కూడా సుజన కు సూచించడంతో ఇక ఈ విషయం ఇంతటితో ముగిసినట్లేనని భావిస్తున్నారు.