‘విగ్రహం’ ఫై ఎన్ టి ఆర్ కుమారుల్లో చీలిక
posted on Dec 12, 2012 @ 12:27PM
పార్లమెంట్ లో ఎన్ టి ఆర్ విగ్రహాన్ని ప్రతిష్టించే విషయంలో జరుగుతున్న మాటల యుద్దాల స్థాయి రోజుకు రోజుకు పెరుగుతోంది. నిన్న బాల కృష్ణ తన సోదరి పురందేశ్వరి ఫై విమర్శలు చేసిన విషయం తెలిసిందే.
కాగా, ఈ రోజు టి డి పి నేత హరి కృష్ణ అనూహ్య రీతిలో వ్యాఖ్యలు చేశారు. అయితే, ఇవి చంద్ర బాబు కు కాకుండా, పురందేశ్వరి కి మద్దతు తెలిపే విధంగా ఉండటం విశేషం. పార్లమెంట్ లో ఎన్ టి ఆర్ విగ్రహాన్ని ప్రతిష్టించడం అనేది ప్రతి తెలుగు వాడు గర్వించాల్సిన విషయమని, ఈ విషయంలో పార్టీ గానీ, అల్లుళ్ళు కానీ జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదని హరి కృష్ణ అన్నారు.
ఈ విషయంలో బాల కృష్ణ, హరి కృష్ణ లు భిన్న ప్రకటలను చేయడం చూస్తుంటే ఈ విషయంలో ఎన్ టి ఆర్ కుమారులలో చీలిక వచ్చినట్లు తెలుస్తోంది. ఈ విగ్రహాన్ని నేలేకోల్పడమనేది పూర్తిగా తమ కుటుంబ సభ్యుల అంగీకారం మేరకు జరిగిందనీ, ఇందులో ఎవరి జోక్యం అవసరం లేదని హరి కృష్ణ వ్యాఖ్యానించినట్లు సమాచారం. ఆయన వ్యాఖ్యలు పార్టీలకు అతీతంగా మాట్లాడినట్లు భావించాల్సి వస్తోంది. ఏది ఎలా ఉన్నా, ఈ అంశం దివంగత నాయకుని కుమారుల్లో చీలికకు దారి తీయడం మాత్రం విచారకరం.