శ్రీశైలం జలాశయంలోకి భారీ ఇన్ ఫ్లో
posted on Sep 5, 2012 @ 12:12PM
ఎగువన కురుస్తున్న వర్షాలతో శ్రీశైలం జలాశయంలోకి భారీగా వరదనీరు చేరుతోంది. ప్రస్తుతం జలాశయంలోకి లక్షా పాతికవేలకుపైగా క్యూసెక్కుల ఇన్ ఫ్లో ఉంది. జలాశయం ప్రస్తుత నీటిమట్టం 843.80 అడుగులకు చేరుకుంది. ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు. పుష్కలంగా వస్తున్న వరదనీటిని కిందికి వదిలితే ఇక కృష్ణా డెల్టా కష్టాలు తీరినట్టేనని రైతులు సంబరపడుతున్నారు. రాష్ట్రంలో మిగతా జలాశయాలుకూడా వరదనీటితో నిండి కళకళలాడుతున్నాయి.