రాజ్యసభలో చొక్కాలుపట్టుకున్న ఎంపీలు
posted on Sep 5, 2012 @ 12:43PM
ఉద్యోగుల పదవోన్నతుల్లో రిజర్వేషన్ల బిల్లు రాజ్యసభలో దుమారం రేపింది. ప్రభుత్వం బిల్లును రాజ్యసభలో ప్రవేశపెట్టగానే బీఎస్పీ సభ్యులనుంచి తీవ్రస్థాయిలో నిరసన వ్యక్తమైంది. సమాజ్ వాదీ పార్టీ సభ్యులు బీఎస్పీ సభ్యుల తీరుని తప్పుపట్టడంతో ఇరువర్గాలమధ్య ఘర్షణ జరిగింది. ఎస్పీ, బీఎస్పీ ఎంపీలిద్దరు చొక్కాలు పట్టుకుని కొట్టుకోవడంతో సభాపతి సభను వాయిదావేశారు.