జూడాల సమ్మె ఉద్ధృతం
posted on Sep 5, 2012 @ 11:40AM
తమ డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ సమ్మె చేస్తున్న జూనియర్ డాక్టర్లు గట్టి పట్టుదలతో ఉన్నారు. డిమాండ్లను పరిష్కరించేవరకూ సమ్మె ఆపేది లేదని స్పష్టంగా చెబుతున్నారు. వైద్య ఆరోగ్యశాఖ కార్యదర్శి రత్నకిషోర్ తో జరిగిన చర్చలు విఫలం కావడంతో సమ్మెని మరింత ఉద్ధృతం చేయాలని జూడాలు నిర్ణయించుకున్నారు. సమ్మెకారణంగా ప్రభుత్వాసుపత్రుల్లో రోగులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వం లిఖితపూర్వకంగా హామీ ఇస్తే తప్ప సమ్మె విరమించే ప్రసక్తే లేదని జూడాలు తెగేసి చెబుతున్నారు.