రాజకీయాల్లో పరిటాల శ్రీరామ్ ఎంట్రీకి టైముంది: సునీత
posted on Oct 9, 2012 @ 12:31PM
దివంగత తెలుగుదేశం నాయకుడు పరిటాల రవి పెద్ద కుమారుడు పరిటాల శ్రీరామ్ రాజకీయ రంగ ప్రవేశానికి రంగం సిద్ధమైనట్లు జోరుగుగా ప్రచారం సాగుతున్న నేపథ్యంలో పరిటాల శ్రీరాం తెరపై కనిపించడం మొదలుపెట్టాడు. దీంతో రవి అభిమానులు తమ ఆశాదీపం వచ్చిందనుకున్నారు. అక్కడక్కడా కనిపిస్తూ, అడపాదడపా రాజకీయ కార్యక్రమాల్లో మెరుస్తూ ఆశలు రేపిన శ్రీరాం గురించి ఇపుడు ఆయన తల్లి సంచలన నిర్ణయం ప్రకటించారు. వచ్చే ఎన్నికల్లో పరిటాల శ్రీరాం ఎంట్రీ ఉండబోదన్నారు. తన కొడుకు రాజకీయాల్లోకి రావడానికి ఇంకా చాలా టైముందని, ప్రస్తుతానికి ఏ నిర్ణయమూ తీసుకోలేదని అన్నారు. రాబోయే ఎన్నికలలో మాత్రం పరిటాల శ్రీరామ్ పోటీ చేయబోడని ఆమె స్పష్టంచేశారు. శ్రీరాం వచ్చేస్తున్నాడు అనుకున్న అభిమాలకు మాత్రం నిరాశను మిగిల్చింది. ఒకవైపు యువకుల నుంచి పరిటాల శ్రీరామ్‌కు పెద్ద ఎత్తున ఆదరణ లభిస్తుండగా ఈ నిర్ణయం తీసుకోవడం మంచిది కాదేమో అని పరిటాల కుటుంబ అభిమానులు ఆవేదన చెందుతున్నారు.