పెరుగుతున్న అత్యాచారాలపై సోనియాగాంధీ ఫైర్
posted on Oct 9, 2012 @ 2:24PM
హర్యానాలో వరుసగా జరుగుతున్న అత్యాచారాలపై సోనియాగాంధీ మండిపడ్డారు. దళిత అమ్మాయిలపైన అత్యాచారాలకు పాల్పడుతున్న వారిని కటినంగా శిక్షించాలని హర్యానా ముఖ్యమంత్రి భూపేంద్రసింగ్ హుడాను కోరారు. నెల రోజుల వ్యవధిలోనే మహిళలపై వరుసగా 13 అత్యాచారాలు జరగడంపై సోనియా గాంధీ ఆందోళన వ్యక్తం చేశారు. అత్యాచారాలు నిరోధించిందుకు పెళ్లి వయస్సును తగ్గించాలన్న ఖాప్ పంచాయతీ తీర్మానాన్ని ఈ సందర్భంగా ఆమె ఖండించారు. చట్టం ప్రకారమే అందరూ నడుచుకోవాలని హెచ్చరించారు. హర్యానాలోని జింద్ జిల్లాలో ఓ దళిత బాలిక అత్యాచారానికి గురైంది. సోనియా ఈ రోజు ఆమె కుటుంబాన్ని పరామర్శించారు. బాధిత కుటుంబాలను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకుంటుందని చెప్పారు.