సూపర్ ఓవర్లో శ్రీలంక సూపర్ విక్టరీ
posted on Sep 28, 2012 @ 11:39AM
గురువారం జరిగిన సూపర్-8, టి-20 ప్రపంచ కప్ మ్యాచ్ లోజరిగిన థ్రిల్లింగ్ మ్యాచ్‌లో శ్రీలంక కివీస్ పై సూపర్ విక్టరి సాధి౦చింది. సూపర్ ఓవర్లో శ్రీలంక ఒక వికెట్‌కు 13 పరుగులు చేయగా, న్యూజిలాండ్ ఒక వికెట్ నష్టానికి ఆరు పరుగులకే పరిమితమైంది. టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన కివీస్ నిర్ణీత ఓవర్లలో ఏడు వికెట్లకు 174 పరుగులు చేసింది. నికోల్ 40 బంతు ల్లో 3 ఫోర్లు, 4 సిక్సర్లతో 58 పరుగులతో మెరుపు హాఫ్ సెంచరీ చేయగా, గుప్టిల్ 30 బంతుల్లో 6 ఫోర్లతో 38 పరుగులు చేయగా, బ్రెండన్ 16 బంతుల్లో 2 సిక్సర్లతో 25, టేలర్ 15 బంతుల్లో 2 ఫోర్లతో 23 దూకుడుగా ఆడారు. అనంతరం 175 పరుగుల లక్ష్యఛేధనలో లంకేయులు పూర్తి ఓవర్లలో ఆరు వికెట్లకు 174 పరుగులే చేసింది. ది ల్షాన్ 53 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్సర్లతో 76 పరుగులు, మహేల 26 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్సర్లతో 44 మెరుపులు మెరిపించారు. ఓ దశలో లంక సునాయాసంగా విజయం సా ధించేలా కనిపించినా చివరకు ఉత్కంఠకు దారితీసింది. దిల్షాన్‌కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ దక్కింది.