ప్రియుడి కోసం కన్నకొడుకిని చంపిన మహిళ
posted on Sep 28, 2012 @ 10:24AM
కర్నూలు జిల్లాలో ప్రియుడి మాయలో పడి కన్న కొడుకునే ఓ మహిళ చంపివేసింది. తనకి, ప్రియుడికి మధ్య కొడుకు అడ్డం వస్తున్నాడని నాలుగేళ్ల కొడుకుని హతమార్చింది. భర్తను వదిలేసి గత 20 రోజులుగా లక్ష్మి బేతంచర్లలో బాషాతో కలిసి ఉంటోంది. తనతో రావాలని భర్త ఆమెను పదే పదే వేడుకున్నా వినలేదు. పెద్ద మనుషులతో కూడా చెప్పించాడు. అయినా ఆమె వినలేదు. చివరకు కన్న కొడుకుని చంపి తన భర్త మీదికి నేరాన్ని వేయడానికి పూనుకుంది. అయితే ఆమె కొడుకును చంపి ఆ శవాన్ని తన భర్త ఇంటి వద్ద వెయ్యాలని తీసుకుని వెళ్ళుతుండగా గ్రామస్థులు గమనించి ఆమెను చెట్టుకు కట్టేసి కొట్టి, పోలీసులకు అప్పగించారు.