అండర్ 19 ప్రపంచకప్ భారత్ సొంతం
posted on Aug 26, 2012 @ 1:55PM
అండర్ 19 ప్రపంచకప్ ని భారత్ సొంతం చేసుకుంది. ఫైనల్లో ఆస్ట్రేలియాపై 6 వికెట్ల తేడాతో భారత్ ఘనవిజయం సాధించింది. ఉమ్మక్తచంద్ సెంచరీ, పటేల్ హాఫ్ సెంచరీ జట్టుని బలంగా నిలబెట్టాయి. 47.4 ఓవర్లలోనే భారత్ 227 పరుగులు సాధించి
విజయాన్ని సొంతం చేసుకుంది. అపర్ జిత్ 33 పరుగులు చేశాడు. ఆసీస్ బౌలర్లు పరీస్, స్టెకెటీ, సందూ, టర్నర్.. తలో వికెట్ తీశారు. టాస్ గెలిచిన భారత్ బౌలింగ్ ని ఎంచుకుంది. ముందుగా బ్యాటింగ్ చేసిన ఆసీస్ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 225 పరుగులు చేసింది. భారత్ అండర్ 19 ప్రపంచకప్ ని గెలవడం ఇది మూడోసారి. 2000, 2008, 2012లలో అండర్ 19 ప్రపంచ కప్ ని గెలిచిన భారత్ అస్ట్రేలియా రికార్డ్ ని సమం చేసింది.