శ్రీలక్ష్మికి ఉస్మానియాలో చికిత్స
posted on Aug 26, 2012 @ 3:43PM
ఓబుళాపురం మైనింగ్ కేసులో అరెస్టై చంచల్‌గూడ మహిళా జైల్లో
ఉన్న ఐఎఎస్ అధికారి శ్రీలక్ష్మికి శనివారం ఉస్మానియా ఆసుపత్రిలో వైద్య పరీక్షలు జరిపించారు. మేడం తీవ్రస్థాయిలో నడుం నొప్పితో బాధపడుతుండడంతో ఆమెను హుటాహుటిని ఆసుపత్రికి తరలించారు. ఆర్ధో, న్యూరో, జనరల్ విభాగాలకు చెందిన నిపుణులు శ్రీలక్ష్మికి వైద్యపరీక్షలు జరిపారు. పూర్తిస్థాయి చికిత్సకోసం మరోసారి శ్రీలక్ష్మిని ఉస్మానియాకు తీసుకెళ్లాలని అధికారులు వైద్యుల సలహామేరకు నిర్ణయించారు.