ప్రేయసితో సరసాలాడుతూ పెళ్లానికి దొరికిపోయిన ఎస్సై
posted on Aug 26, 2012 @ 12:53PM
బేగం బజార్ పోలీస్టేషన్ ఎస్సై వెంకట్ రెడ్డి ప్రేయసితో సరసాలాడుతూ పెళ్లానికి అడ్డంగా దొరికిపోయాడు. కడుపుమండిన పెళ్లాం.. ఇద్దరినీ బజారుకీడ్చేందుకు ప్రయత్నించింది. మొదటి భార్య బంధువులు ఎస్సైమీద, కొత్త ప్రియురాలిమీద దాడికి ప్రయత్నించడంతో కొద్దిసేపు ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. ఫిర్యాదుచేస్తే నిందితుడిపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని పోలీస్ అధికారులు హామీ ఇవ్వడంతో పరిస్థితి సద్దుమణిగింది. అడ్డంగా దొరికిపోయిన ఎస్సైమాత్రం అడ్డగోలుగా వాదిస్తున్నాడు. తనపై ఉద్దేశపూర్వకంగా తప్పుడు ప్రచారం చేస్తున్నారని బుకాయిస్తున్నాడు.