స్పీడ్ న్యూస్ 2
posted on Jul 19, 2023 @ 2:34PM
21. యమునా నది మళ్లీ ప్రమాదస్థాయిని మించి ప్రవహిస్తోంది. దీంతో దేశ రాజధాని నగరం ఢిల్లీ మళ్లీ జలదిగ్బంధనంలో చిక్కుకుంది. పొరుగు రాష్ట్రాలైన హర్యానా, ఉత్తరాఖండ్ లలో కురుస్తున్న తాజా వర్షాల కారణంగా యమున ఉప్పొంగి ప్రవహిస్తోంది.
...................................................................................................................................................
22. జమ్మూకశ్మీరులో ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు. అనంత్ నాగ్ జిల్లాలో ఉగ్రవాదుల కాల్పుల్లో ఇద్దరు వలస కార్మికులు గాయపడ్డారు. ఉగ్రవాదుల కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. క్షతగాత్రులకు ప్రాణాపాయం లేదని వైద్యులు తెలిపారు.
............................................................................................................................................
23. సిటీ బస్సులో చిల్లర సమస్యకు చెక్ పెట్టేందుకు టీఎస్‌ఆర్టీసీ టికెట్ల కొనుగోలుకు క్యూఆర్ కోడ్ స్కాన్ విధానాన్ని తీసుకురానుంది. దీంతో కండక్టర్‌కు డబ్బు చెల్లించకుండా నగదు రహిత టికెట్ కొనుగోలు చేయడానికి వీలౌతుంది.
.....................................................................................................................................
24. తిరుమల నడకదారిలో చిరుతపులి సంచారం భక్తులను భయపెడుతోంది. తాజాగా నిన్న రాత్రి 33 వ మలుపు వద్ద చిరుత సంచారాన్నిభక్తులు గుర్తించారు. నడకదారిన వెళ్లే భక్తులు గుంపులు గుంపులుగానే వెళ్లాలని ఫారెస్ట్ సిబ్బంది, టీటీడీ అధికారులు సూచిస్తున్నారు.
........................................................................................................................................
25. రోడ్డు ప్రమాద మరణాలలో ప్రపంచంలోనే భారత్ అగ్ర స్థానంలో ఉంది. దేశంలో రోడ్డు ప్రమాదాల కారణంగా ఏటా 15 లక్షల మంది మరణిస్తున్నారు. ఈ వివరాలను ఫిక్కీ నివేదిక వెల్లడించింది. మానవుల మరణాలలో రోడ్డు ప్రమాదాలు 8వ స్థానంలో ఉన్నాయని నివేదిక పేర్కొంది.
.......................................................................................................................................
26.శంషాబాద్ విమానాశ్రయంలో 1.7 కేజీల బంగారాన్ని కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. కువైట్ నుంచి హైదరాబాద్ కు వస్తున్న విమానంలో కొందరు అక్రమంగా బంగారాన్ని తరలిస్తున్నారన్న పక్కా సమాచారంతో కస్టమ్స్ అధికారులు తనిఖీలు చేపట్టారు. ఇద్దరిని అరెస్టు చేశారు.
.......................................................................................................................................
27.వారం రోజుల్లో డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయకుంటే ప్రగతి భవన్ ను ముట్టడిస్తామని కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి కేసీఆర్ సర్కార్ ను హెచ్చరించారు. ఈ మేరకు ఆయన సీఎం కేసీఆర్ కు ఒక బహిరంగ లేఖ రాశారు.
................................................................................................................................................
28. మూడు పంటలు, 24 గంటల కరెంటు అంటూ బీఆర్ఎస్ చెబుతున్న మాటలు పచ్చి అబద్ధాలని వైఎస్సీర్టీపీ అధినేత్రి షర్మిల అన్నారు. కనీసం ఎనిమిది గంటల కరెంటు కూడా ఇవ్వలేనోళ్లు 24 గంటలూ విద్యుత్ సరఫరా చేస్తున్నామనడం దెయ్యాలు వేదాలు వల్లించినట్లుందని ట్వీట్ చేశారు.
...................................................................................................................................................
29. ఢిల్లీలో నిన్న జరిగిన ఎన్డీయే సమావేశానికి హాజరైన పార్టీలలో కొన్ని పార్టీల పేర్లే తాను ఎన్నడూ వినలేదని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే అన్నారు. ఊరూపేరూ లేని పార్టీలు ఆ మీటింగ్ కు హాజరయ్యాయని విమర్శించారు.
................................................................................................................................
30. ఒడిశా బాలేశ్వర్లో త్రుటిలో ఘోర రైలు ప్రమాదం తప్పింది. సిగ్నలింగ్ లో రైలు లూప్ లైన్లో ప్రవేశించింది. అయితే లోకోపైలట్ అప్రమత్తతతో బ్రేకులు వేయడంతో ఘోర ప్రమాదం తప్పింది.
................................................................................................................................................................
31.పెద్దపల్లి జిల్లా రంగాపూర్ శివారులోని ఎస్సారెస్పీ కాలువలో ప్రమాదవశాత్తు దుప్పి పడిపోయింది. ఇది గమనించిన గ్రామస్తులు దానిని బయటకు తీసి అటవీ అధికారులకు సమాచారం అందించారు. అటవీ అధికారులు గ్రామస్తులను అభినందించారు.
.................................................................................................................................................
32. పార్లమెంటు వర్షాకాల సమావేశాలపై చర్చించేందుకు కేంద్రం నేడు అఖిల పక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసింది. రేపటి నుంచి పర్లమెంటు వర్షాకాల సమావేశాలు ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే.
.........................................................................................................................................................
33. విపక్షాల ఐక్యతా సమావేశానికి వేదిక అయిన బెంగళూరులో బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ కు వ్యతిరేకంగా పోస్టర్లు వెలిశాయి. ఒక వంతెనను నిర్మించలేని వ్యక్తి దేశానికి ప్రధాని పదవికి పోటీ పడటమా అంటే వెలిసిన పోస్టర్లను బెంగళూరు నగరపాలక సంస్థ తొలగించింది.
..................................................................................................................................................
34. ర్ణాటక రాజధాని బెంగళూరులో పేలుళ్లకు ఉగ్రవాదులు పన్నిన కుట్రను పోలీసులు ఛేదించారు. ఈ సందర్భంగా ఐదుగురు అనుమానితులను సెంట్రల్ క్రైం బ్రాంచ్ పోలీసులు ఈ రోజు అరెస్టు చేశారు.
......................................................................................................................................................
35. జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై మంత్రి ఆర్కే రోజా మరో సారి ఫైర్ అయ్యారు. పవన్ దళపతి కాదు దళారి అంటూ విమర్శించారు. బుధవారం మీడియాతో మాట్లాడిన ఆమె చంద్రబాబు కోసం జగన్ ఢిల్లీ వెళ్లారని ఆరోపించారు.
.........................................................................................................................................
36. మైనార్టీ మహిళలకు కుట్టుమిషన్లు అందజేసేందుకు ప్రభుత్వం ప్రవేశపెట్టిన కేసీఆర్ కానుక పథకం దరఖాస్తులకు రేపటితో గడువు ముగియనున్నది. నిరుపేదలైన మైనార్టీ మహిళలకు స్వయం ఉపాధి కల్పించేందుకు ప్రభుత్వం 20 వేల కుట్టుమిషన్లను అందజేయనున్నది.
...................................................................................................................................................
37. తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు మహారాష్ట్ర పర్యటన ఖరారైంది. వచ్చే నెల 1వ తేదీన మహారాష్ట్రలోని వాటేగావ్ లో తుకారం భావురావ్ సాఠే జయంతి వేడుకల్లో కేసీఆర్ పాల్గొననున్నారు. మహాలో బీఆర్ఎస్ విస్తరణ కోసం కేసీఆర్ కృషి చేస్తున్న సంగతి తెలిసిందే.
.............................................................................................................................................
38. సంక్షేమ పథకాల అమలులో తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నదని విప్ అరెకపూడి గాంధీ అన్నారు. హఫీజ్‌పేట్ డివిజన్‌కు చెందిన పలువురు వ్యాపారులు బీఆర్‌ఎస్‌లో చేరిన సందర్భంగా గాంధీ మాట్లాడుతూ కేసీఆర్ సీఎంగా హ్యాట్రిక్ కొట్టడం ఖాయమన్నారు.
...................................................................................................................................................
39.నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ జిరాయాత్ నగర్ లో ఇద్దరు మహిళల దారుణ హత్య కలకలం రేపింది. అక్క చెల్లెళ్లయిన మగ్గిడి గంగవ్వ (62 ) ,మగ్గిడి రాజవ్వ (72 )ను గుర్తు తెలియని వ్యక్తులు మారణాయుధాలతో కొట్టి హత్య చేశారు.
..............................................................................................................................................
40. ఆగస్టు 8న పాక్ జాతీయ అసెంబ్లీ రద్దు అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన పాక్ జాతీయ అసెంబ్లీని పదవీ కాలం ముగియడానికి రోజుల ముందే రద్దు చేసేందుకు పాలక సంకీర్ణ భాగస్వామ్య పక్షాలు అంగీకరించినట్లు తెలుస్తోంది.