ప్రతిపక్ష కూటమికి దూరమైన మజ్లిస్ 

2012లో యుపీఏకూటమి నుంచి వైదొలగిన ఎంఐఎం కు ప్రతి పక్ష కూటమిలో భాగస్వామ్యం కల్పించకపోవడం చర్చనీయాంశమైంది.  బెంగుళూరులో జరిగిన ప్రతిపక్ష కూటమిలో ఎంఐఎం కు కనీసం ఆహ్వానం అందకపోవడం గమనార్హం. మొత్తం 24 ప్రతిపక్ష పార్టీల్లో ఎంఐఎంకు చోటు దక్కకపోవడం జాతీయ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. భాగ్య లక్ష్మి వివాదం కేసులో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం అసదుద్దీన్ ఒవైసీ, అక్బరుద్దీన్ ఓవైసీలను అరెస్ట్ చేసింది. అప్పట్లో ఎంఐఎం కేవలం 7గురు శాసనసభ్యులను మాత్రమే కలిగి ఉంది. 
గత నెలలో జరిగిన ప్రతిపక్ష కూటమి పాట్నాలో సమావేశమైనప్పుడు కేవలం 16 పార్టీలను ఆహ్వానిస్తే ప్రస్తుతం మరో 8 రాజకీయ పక్షాలకు ఆహ్వానం అందింది. అయినప్పటికీ ఆహ్వానం అందకపోవడంతో ఎంఐఎం వర్గాల్లో అసంతృప్తి వ్యక్తమౌతోంది. ఇటీవలె బీఆర్ఎస్ తో స్నేహ సంబంధాలను తెంచుకున్న ఎంఐఎం బిజెపీతో లోపాయికారి ఒప్పందం చేసుకుందన్న టాక్ వినిపిస్తుంది. ఈ కారణంగా ఆహ్వానం అందకపోవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. 
గతంలో నరేంద్ర మోడీని టార్గెట్ చేస్తూ ప్రకటనలు చేసే అసద్ ప్రస్తుతం మెతక వైఖరి ప్రదర్శించడం కారణం కావొచ్చు అని తెలుస్తోంది. 

Teluguone gnews banner