స్పీడ్ న్యూస్ 3
posted on Jul 19, 2023 @ 3:17PM
41. జగన్ సర్కారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేస్తోందని బీజేపీ ఏపీ చీఫ్ పురందేశ్వరి మండిపడ్డారు. బుధవారం పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆమె మద్యం అమ్మకాలపై భవిష్యత్తులో వచ్చే ఆదాయం తాకట్టు పెట్టి రూ.8 వేల కోట్లకు పైగా అప్పు చేసిందన్నారు.
........................................................................................................................................................
42. వరంగల్ జిల్లాలో భారీ వర్షం కారణంగా రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు క్యాంపు కార్యాలయంలో భారీ వృక్షం నేలకూలింది. ఈ సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది.
............................................................................................................................................
43. గత రెండు రోజుల నుంచి కురుస్తున్న వానలకు భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం స్వల్పంగా పెరుగుతుంది. ఈరోజు ఉదయం 9 గంటల సమయంకి భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం 25.8 అడుగులకు చేరుకుంది. ఇది మరింతగా పెరిగే అవకాశం ఉంది.
.............................................................................................................................................
44. ఎల్ సాల్వడార్‌లో భారీ భూకంపం వచ్చింది. ప దీని తీవ్రత రికార్ట్ స్కేల్ పై 6.5గా నమోదయ్యింది. వెల్లడించింది. సముద్ర గర్భంలో 70 కిలోమీటర్ల లోతులో ప్రకంపణలు చోటు చేసుకున్నాయి. ఈ భూకంపం కారణంగా ప్రాణ, ఆస్తి నష్టం జరిగినట్లు సమాచారం లేదు.
........................................................................................................................................
45. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేస్తే రాష్ట్రానికి మళ్లీ చీకటి రోజులు వస్తాయని మంత్రి మల్లారెడ్డి అన్నారు. రైతు వేదిక సభలో మాట్లాడిన ఆయన రేవంత్ రెడ్డిని రైతు వ్యతిరేగా అభివర్ణించారు.
..................................................................................................................................................
46. ఇంటర్ కాలేజీలలో మౌలిక సదుపాయాల కల్పన కోసం 60 కోట్ల రూపాయలు మంజూరు చేసినా ఇంకా పనులు పూర్తి కాకపోవడంపై మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంటర్ విద్యపై సమీక్ష నిర్వహించిన ఆమె మౌలిక సదుపాయాల కల్పనకు తక్షణ చర్యలు తీసుకోవాలన్నారు.
........................................................................................................................................
47. 60 ఏళ్ల పాలనలో కాంగ్రెస్ ఎప్పుడూ రైతులను పట్టించుకోలేదన్న మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు ఏడాది మూడు పంటలు కావాలంటే బీఆర్ఎస్ ను గెలిపించాలనీ, మూడు గంటల కరెంట్ కావాలంటే కాంగ్రెస్ కు ఓటేయాలని అన్నారు.
..................................................................................................................................................
48. జనసేన అధినేత పవన్ కల్యాణ్ ను సీపీఔ నారాయణ రాజకీయ బ్రోకర్ అంటూ విమర్శించారు. ఎన్డీఏతో పవన్ కలవడం ప్రజాస్వామ్యానికి, లౌకికవాదానికి ప్రమాదకరమని హెచ్చరించారు.
...................................................................................................................................................
49. మంత్రి అంబటి రాంబాబు పోలవరం ప్రాజెక్టును పరిశీలించారు. డయాఫ్రమ్ వాల్, డ్యామ్ దగ్గర వరదపై సమీక్ష నిర్వహించారు. ప్రాజెక్టు నిర్మాణ పనులపై ఆరా తీశారు. ఈ సందర్భంగా అంబటి మాట్లాడుతూ గత టీడీపీ ప్రభుత్వం కారణంగానే ప్రాజెక్టు ఆలస్యమౌతోందన్నారు.
...........................................................................................................................................
50. పారిశుద్ధ్య కార్మికుల సమస్యలను ప్రభుత్వం పరిష్కరిస్తుందన్న మంత్రి హరీష్ రావు వెంటనే సమ్మె విరమించి విధుల్లో చేరాల్సిందిగా వారిని కోరారు. వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో సీజనల్ వ్యాధుల వ్యాప్తి ముప్పు ఉన్నందున సమ్మె విరమించాలని హరీష్ అన్నారు.