శ్రుతి హాసన్ కి అనారోగ్యం

 

టైట్ షెడ్యూల్.. పంక్చువాలిటీకి, పర్ ఫెక్షన్ కి పెద్ద పీట వేసే మనస్తత్వం.. షూటింగ్ మీద పూర్తి కాన్ సన్ ట్రేషన్.. ఓవర్ లోడ్.. అన్నీ కలిపి శ్రుతి హాసన్ ని ఆసుపత్రి పాలు చేశాయ్. పూనేలో ప్రభుదేవా దర్శకత్వంలో తెరకెక్కుతున్న రామయ్యా వస్తావయ్యా సినిమా షూటింగ్ లో విపరీతంగా అలిసిపోయిన శ్రుతి హాసన్ అనారోగ్యం పాలైంది. షూటింగ్ గ్యాప్ లో సొంతపనిమీద చెన్నె వెళ్లిన బ్యూటీ క్వీన్ కళ్లు తిరిగి పడిపోవడంతో ఆగమేఘాలమీద ఆసుపత్రిలో చేర్చారు. ఎక్కువగా పనిచేయడంవల్ల శక్తి లేక విపరీతంగా అలసిపోవడం, డీ హైడ్రైషన్ కారణాలవల్ల శ్రుతి హటాత్తుగా కళ్లు తిరిగి పడిపోయిందని డాక్టర్లు చెబుతున్నారు. నాలుగ్గంటలతర్వాత హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అవ్వగానే శ్రుతి నేరుగా మళ్లీ పూనే షూటింగ్ స్పాట్ కెళ్లిపోయి సాంగ్ ని పూర్తి చేసిందట. తన వల్ల మిగతా వాళ్లకి ఇబ్బంది కలగకూడదన్న ఉద్దేశంతో శ్రుతి తీసుకున్న ఈ నిర్ణయాన్ని సినిమా నిర్మాత తెగ మెచ్చుకుంటున్నాడు. కమల్ తనయగనకే అంతగా డిసిప్లిన్ కి ప్రాధాన్యం ఇస్తోందని ఇండస్ట్రీ వర్గాలు కూడా అనుకుంటున్నాయ్.

తెలంగాణ ఎన్నికల్లో కేరళ స్టోరి ప్రచారాస్త్రం

ఇటీవలె కర్ణాటకలో బిజెపి ఘోర పరాజయం చెందిన తర్వాత  కూడా వాళ్ల వైఖరిలో మార్పు రాలేదు అని వెల్లడౌతుంది.  కాంగ్రెస్ మేనిఫెస్టోలో తాము మళ్లీ అధికారంలో వస్తే భజరంగ్ దళ్ పై ఉన్న నిషేధం అమలు చేస్తామని పేర్కొనడంతో కర్ణాటక ఫలితాలను ప్రభావితం చేసింది. ఒక దశలో కాంగ్రెస్ మేనిఫెస్టో ను బిజెపి కార్యాలయంలో ప్రెస్ మీట్ పెట్టి చించివేశారు బిజెపి నేతలు. భజరంగ్ దళ్ ను నిషేధిస్తే భజరంగ్ దళ్ పల్లెత్తు మాట అనలేదు కానీ బిజెపి నేతలు మాత్రం చొక్కాలు చింపుకున్నంత పని చేశారు.  తెలంగాణా రాష్ట్రంలో కూడా బిజెపి మతోన్మాదాన్ని రెచ్చగొట్టే ఫార్ములా అమలు చేయబోతుందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.  వచ్చే అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో యువ ఓటర్లను ఆకర్షించడానికి వివాదాస్పద ‘‘ ది కేరళ స్టోరి’’ సినిమా స్క్రీన్స్ వేయాలని యోచిస్తోంది. ఇటీవలె ఆదిలాబాద్ జిల్లా బిజెపి ఈ సినిమా ప్రత్యేక షో వేసారు. తెలంగాణలో హిందూ ఓటర్లను ఆకర్షించడానికి బిజెపి పన్నాగాల్లో ఈ సినిమా ఒక ప్రచారాస్త్రంగా నిలిచింది. ఆదిలాబాద్ జిల్లాలోని మారుమూల గ్రామాల్లో స్క్రీన్లు వేసి లవ్ జిహాద్ అంశాన్ని ప్రజలకు తెలియజేస్తామని బిజెపి నేతలు చెబుతున్నారు. హిందూ యువతులు లవ్ జిహాద్లో పడకూడదన్న ఉద్దేశ్యంతో ఈ సినిమాను గ్రామ గ్రామాన ప్రదర్శిస్తామని ఆదిలాబాద్ జిల్లా బిజెపి అధ్యక్షులు పాయల్ శంకర్ తెలిపారు. కేరళ స్టోరీలో 32,000 హిందూ అమ్మాయిలు కనిపించకుండాపోయి టెర్రరిస్ట్ గ్రూప్ అయిన ఐసిస్ లో  చేరతారు. తెలంగాణలో 119 నియోజకవర్గాల్లో ఎన్నికలు జరగనున్నాయి. బిఆర్ఎస్, బిజెపి, కాంగ్రెస్, ఎంఐఎం పార్టీలు అభ్యర్థులను నిలబెట్టనున్నాయి.