బేష్ అనిపించుకునేందుకు టి.మంత్రుల పాట్లు!
posted on Oct 2, 2012 @ 9:48AM
తెలంగాణా ప్రత్యేక రాష్ట్రం సాధన కోసం తమ బలాన్ని నిరూపించుకునేందుకు చేపట్టిన మార్చ్‌ఫాస్ట్ కాంగ్రెసుపార్టీలో పెద్ద కలకలాన్నే రేపింది. మార్చ్‌ఫాస్ట్ ముగిసిన తరువాత తెలంగాణాప్రాంతానికి చెందిన మంత్రులు హంగామా చేస్తున్నారు. తామే ప్రభుత్వానికి పెద్ద దిక్కు అని చెప్పుకునేందుకు వచ్చిన ఈ అవకాశాన్ని వినియోగించుకుంటూ కాంగ్రెస్ పార్టీపై అలుగుతున్నారు. ఒకరి తరువాత ఒకరుగా మొత్తం నలుగురు తెలంగాణా మంత్రులూ రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డిపై కారాలూ మిరియాలూ నూరుతున్నారు. ప్రత్యేకించి అధిష్టానానికి సిఎంపై ఫిర్యాదు చేసేందుకు అవసరమైన గ్రౌండ్‌ను కూడా తయారు చేసుకున్నారు. దీని ఆధారంగా సిఎంపై ఒత్తిడి చేసి టిఆర్‌ఎస్, తెలంగాణా జెఎసి నుంచి బేష్ అనిపించుకోవాలని తపనపడుతున్నారు. ముందుగా ఈ కోవలోకి కరీంనగర్ జిల్లా నాగార్జునసాగర్ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి జానారెడ్డి చేరిపోయారు. ఆయన తనకున్న ఢల్లీ బలాన్ని సిఎంపై ఒత్తిడి రూపంలో తీసుకువచ్చేందుకు తెగఫోన్లను వాడేస్తున్నారు. తనతో పాటు ఈ జాబితాలో చేరిన డిప్యూటీ సిఎం దామోదర రాజనరసింహను కూడా రెచ్చగొడుతున్నారు. అంతేకాకుండా సిఎంను దుర్భాషలాడేటప్పుడు నరసింహను కూడా తోడుగా ఉంచుకున్నారు. వీరిద్దరికి మరో ఇద్దరు మంత్రులు వంత పాడుతున్నారు. తెలంగాణా ప్రాంతంలో పేరెన్నికగన్న ఈ మంత్రులూ వీరితో పాటు కయ్యానికి సిద్ధపడ్డారు.