సైబర్ ప్రలోభాలకు చెక్ చెప్పండి
posted on Oct 26, 2012 @ 3:14PM
సోషల్ నెట్ వర్క్ ప్రపంచాన్ని శాసిస్తున్నాయనటంలో సందేహంలేదు. అయితే వాటి వినియోగంలో జాగ్రత్తలు తీసుకోక పోతే చాలా నష్ట పోవలసి వస్తుంది. కొన్ని యస్ ఎమ్ యస్ లు లేదా మెయిల్స్ వస్తాయి. దానిలో మీకు కోట్లడాలర్ల ప్రైజ్ మనీ గెలుచుకున్నారని మీ పూర్తి వివరాలతో ఫలానా నెంబరుకు యస్ఎమ్మెస్ చేయండి లేదా మాట్లాడండి అంటూ ఒక నెంబరు ఇస్తారు. దానిలోనే మీ ఇ మెయిల్ ఐడిని పంపండంటూ వస్తుంది. మరికొన్ని మా తండ్రికి అనారోగ్యంతో చనిపోయారు. ఆయన పేరు మీద 20000కోట్ల ఆస్తులున్నాయి. లీగల్ గా కొంత రుసుము కట్టవలసి ఉంది. అధి కడితే మేము మీకు ఇంత మొత్తం వాటాగా ఇస్తాం అంటూ కొన్ని డాక్యు మెంట్లు కూడా పెడతారు. అది చూసి సరేనని కట్టామా మన సంగతి అంతే మోసానికి గురి అయిన వారు సైబర్ నేరాల క్రింద కేసు నమోదు చేసిన మళ్లీ మన డబ్బు వస్తాయనేది కల్ల. ఇలాంటి కేసుల్లో ఎక్కువమంది నైజీరియాకు చెందినవారు ఉంటున్నారు. వారు స్టూడెంట్ పాస్, జాబ్, టూరిజం వంటి వీసాలతో ఇక్కడికి ప్రవేశించి గడువు ముగిసినా దేశం లోనే ఉంటూ రకరకాలయిన నేరాలు చేస్తున్నారు. మరికొందరు ఫేక్ మనీ, డ్రగ్స్, స్మగ్లింగ్ చేస్తుంటే మరికొందరు ఈ సైబర్ లాటరీలను తెరపైకి తెచ్చారు. ఏది ఏమైనా లాటరీలు ప్రయిజ్ మనీ విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. మోసపూరితంగా ఉండే ఇమెయిల్సను ఓపెన్ చెయ్యకూడదు. అనుమానం వస్తే మీ పాస్ వర్డ్ ను మార్చుకొండి. ఇంకా ఏమైనా అనుమానాలుంటే పోలీసులకు సమాచారం ఇవ్వాలని పోలీసులు కోరుతున్నారు.