కాకతీయ ఉత్సవాలకు ఉలికూ పలుకూ లేని ప్రభుత్వం
posted on Oct 26, 2012 @ 3:16PM
నవంబర్ 24 నుండి 30 వరకు వరంగల్ లో ఘనంగా కాకతీయ ఉత్సవాలను నిర్వహస్తామని ప్రభుత్వం డాబుగా ప్రకటించినా ఇంతవరకు ఉత్సవ కమిటీని కూడా ఏర్పాటు చేయలేదని స్ధానికులు చెబుతున్నారు. రామప్పఅష్టశతాబ్ధి, రుద్రమ పట్టాభి షిక్త పంచశతాబ్ది రెండూ ఈ ఏడాది వచ్చిన నేపద్యంలో ఉత్సవాలను ఘనంగా జరపాలని ప్రజలు కోరుకున్నప్పటికీ సర్కార్ ఏమాత్రం పట్టించుకోక పోవడంతో స్ధానికుల నుండి నిరసన వెల్లువెత్తింది. అయితే కాకతీయ ఫెస్టివల్స్ జరుపుతామంటూ ప్రభుత్వం నాలుగు నెలల క్రితం షెడ్యూల్ విడుదల చేసినప్పటికీ ఇంతవరకు ఏ మాత్రం పనులు ప్రారంభించలేదని జిల్లావాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మొదటి ఈ ఉత్సవాల నిమిత్తం 20 కోట్లు విడుదల చేస్తామని చెప్పినా ప్రస్తుతం 5 లేదా 6 కోట్లకు పరిమితం చేశారని తెలుస్తుంది. ఇదిలా వుండగా కాకతీయ వారసత్య సంపదకు ప్రపంచస్థాయి గుర్తింపు తేవాలని జిల్లాలోని చరిత్రకారులు, కెయూ అద్యాపకులు పట్టుపడుతున్నారు. రామప్పదేవాలయానికి యునెస్కో గుర్తింపు తెస్తామని అధికారులు ప్రకటించినా చర్యలు మాత్రం శూన్యం అని ప్రజలు వాపోతున్నారు.