జననాయకుడిగా క్రేజీవాల్
posted on Oct 26, 2012 @ 3:12PM
రాబర్ట వధేరా కుంభకోణాన్ని,సల్మాన్ ఖుర్షీద్ ట్రస్టు వ్యవహారాన్ని వెలికి తీయడం ద్వారా తనకంటూ ఇమేజ్ తెచ్చుకున్న అరవింద్ క్రేజీవాల్ తనకు పార్టీలతో సంబంధం లేదని నాయకుల అక్రమాలను వెలికి తీయడమే ముఖ్యమని బిజెపి పార్టీ నాయకుడు గడ్కరీ మీద ఆరోపణలతో చెప్పకనే చెప్పారు. ఇవి కేవలం మీడియా లో చర్చలకే కాకుండా సామాన్య మానవుడికి వివిధ పార్టీ నాయకుల అసలు రూపం తెలుసుకునేందుకు ఉపయోగపడిందని కూడా తెలుస్తుంది. సాకాత్తూ న్యాయ శాఖ మంత్రి అన్యాయాలను బయటకు తెచ్చి తద్వారా మంత్రుల గుణ గణాలను అన్యాయం పై ప్రశ్నిస్తే రాజకీయ నాయకులు వారి నిజరూపాలు ఎలా వుంటాయో కూడా జనాలకు చూపించారు. గడ్కరీ పై ఆర్ ఎస్సెస్ నాయకులు నిప్పులు చెరుగుతున్నారు. అదేవిధంగా ఒకటి రెండు రోజుల్లో జరిగే కేంద్ర మంత్రి వర్గ విస్తరణలో అవినీతి ఆరోఫణలు ఎదుర్కొంటున్నవారితో పాటు క్రొత్తగా సల్మన్ ఖుర్షీద్ పేరు కూడా చేర్చబడింది. కేంద్ర మంత్రివర్గం పెదవి విప్పక పోయినా కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ అల్లుడి గారి నిర్వాకం వల్ల పార్టీకి నష్టమేనని కాంగ్రెస్ నాయకులు అంగీకరిస్తున్నారు. రానున్న ఎన్నికల్లో పోటీ చెయ్యనీ చెయ్యక పోనీ, కానీ నేతల పనితీరును, అవినీతిని ఎండగట్టే నాయకుడంటూ ఒకరుండవలసిందేనని ప్రజలు కోరుకుంటున్నారు.