చ్చాల బాధ కలుగుతోంది....
posted on Oct 27, 2013 @ 3:13PM
ప్రజలు అడుగుతున్నారు...ఎప్పుడూ ఎవరినో ఒకరిని అనుకరిస్తూనే ఉంటావెందుకని? ప్రజలు అడుగుతున్నారు. సమైక్యాంధ్ర సభ అని చెప్పి ముప్పై పార్లమెంటు సీట్లు సంపాదించి డిల్లీని శాసిద్దామని ఓట్లు, సీట్లు గురించి ఎందుకు మాట్లాడుతున్నావని ప్రజలు అడుగుతున్నారు? వచ్చేఎన్నికల తరువాత తల్లీ, చెల్లీ, అన్న ముక్త కంఠంతో కాంగ్రెస్ పార్టీకే మద్దతిస్తామని చెపుతూ కూడా మళ్ళీ సోనియమ్మను ఆడిపోసుకోవడమెందుకని...ప్రజలు అడుగుతున్నారు. రాష్ట్ర విభజన చేయిస్తున్నకేసీఆర్ ఊసెత్తకుండా సమైక్యవాదం వినిపిస్తున్నకిరణ్ కుమార్ రెడ్డినే ఎందుకు ద్వేషిస్తున్నావని ప్రజలు అడుగుతున్నారు.
జనగణమణ గీతం కూడా సరిగ్గా పాడలేననందుకు ప్రజలు చ్చాల బాధ పడుతున్నారు. ప్రజలకి బాధ కలుగుతోంది..జనగణమణ గీతం కూడా సరిగ్గా పాడలేని వారు వందేమాతరం గేయం పాడుతామని చెపుతుంటే...బాధ కలుగుతోంది...చ్చాలా బాధ కలుగుతోంది సమైక్యాంధ్ర సభ అని చెప్పి ఓట్లు సీట్లు గురించి మాట్లాడుతున్నపుడు.
చ్చాల బాధ కలుగుతోంది....రాహుల్ గాంధీని సోనియమ్మ ప్రధానిని చేస్తుంటే...ఇది అన్యాయం కాదా? అని నువ్వడుగుతున్నపుడు బాధ కలుగుతోంది. ప్రజలు అడుగుతున్నారు...ప్రజలు అడుగుతున్నారు మరి సోనియమ్మ చేయాలనుకొంటున్న తప్పునే విజయమ్మకూడా ఎందుకు చేస్తోందని? విజయమ్మ కలలు సోనియమ్మా కలలకి తేడా ఏమిటని ప్రజలు అడుగుతున్నారు.
రాజకీయాలలో విలువలు లేకుండా పోయినందుకు చ్చాల... బాధ.. కలుగుతోంది...చ్చాల బాధ కలుగుతోంది దేశంలో, రాష్ట్రంలో మరే పార్టీకి కూడా వైకాపా అంత నీతి నిజాయితీ లేకుండా పోయినందుకు చ్చాల.. బ్భాద కలుగుతోంది. ప్రజలు అడుగుతున్నారు...అయినా అటువంటి నీతినిజాయితీ లేని పార్టీలకే ఎందుకు మద్దతు ఇస్తావని?
సమైక్య సభపెట్టి డిల్లీలో చక్రం తిప్పుదామంటున్నావేమిటని ప్రజలు అడుగుతున్నారు...చ్చాల బాధ పడుతున్నారు....సమైక్యాంధ్ర సెంటిమెంటుని ఇలా క్యాష్ చేసుకోవాలని చూస్తునందుకు... ...నిజంగా చాలా బాధ పడుతున్నారు...