సచిన్ కి ఆస్ట్రేలియా పురస్కారం సబబేనన్న గిల్లార్డ్
posted on Oct 18, 2012 @ 2:13PM
మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ కి తమ దేశంలోకూడా విపరీతమైన ఫాలోయింగ్ ఉందని ఆస్ట్రేలియా ప్రథాని జూలియా గిల్లార్డ్ అన్నారు. జాతి వివక్ష వ్యాఖ్యల వివాదం తలెత్తినప్పుడు సచిన్ హర్భజన్ వైపు నిలబడ్డ విషయాన్ని గుర్తు చేసుకుని మరీ కొందరు ఆస్ట్రేలియన్లు సచిన్ కి అవార్డ్ ఇవ్వడంపై తీవ్ర అభ్యంతరాలు తెలుపుతున్నారు. చాలామంది అభిమానులు కోరుకుంటున్న విషయాన్ని కొద్దిమంది మాత్రం వద్దునుకుంటే పెద్దగా పట్టించుకోవాల్సిన పనేలేదన్న ధోరణి ఆస్ట్రేలియా ప్రథాని మాటల్లో వ్యక్తమైంది