రాహుల్ గాంధీ పై రేప్ కేసును కొట్టేసిన సుప్రీం
posted on Oct 18, 2012 @ 2:38PM
రాహుల్ గాంధీపై ఉన్న కిడ్నాప్, రేప్ కేసుల్ని సుప్రీంకోర్టు కొట్టీసింది. పిటిషన్ వేసిన కిషోర్ పై సిబిఐ దర్యాప్తు చేయించాలని ఆదేశించింది. రాహుల్ గాంధీ ఓ బాలికను అక్రమంగా నిర్భంధించారంటూ కిషోర్ కేసు పెట్టారు. విచారణ జరిపిన అలహాబాద్ హైకోర్టు పిటిషనర్ కి రూ.50 లక్షల రూపాయల జరిమానాను విధించడంతో పాటు సిబిఐ విచారణ జరిపించాలని ఆదేశించింది. హైకోర్ట్ తీర్పును సవాల్ చేస్తూ దాఖలు చేసుకున్న మరో పిటిషన్ పై విచారణ జరిపిన దేశా అత్యున్నత న్యాయ స్థాన౦ రాహుల్ గాంధీపై కేసుల్ని కొట్టివేసింది. యుపి అఖిలేష్ యాదవ్ ప్రోద్బలంతోనే ఈ కేసును ఫైల్ చేసానని పిటిషనర్ అంగీకరించడం, ప్రాధమిక ఆధారాలు లభించకపోవడం లాంటి కారణాలను పరిగణంలోకి తీసుకున్న సుప్రీంకోర్టు రాహుల్ గాంధీపై ఉన్న కేసుల్ని కొట్టివేసింది. తప్పుడు కేసులో నోటీసులందుకున్న రాహుల్.. అడ్డంగా అబద్ధాలాడుతున్న కిషోర్ పై కఠిన చర్య తీసుకోవాలని అలహాబాద్ హైకోర్ట్ ని కోరారు. అసలీ వ్యవహారంతో తనకెలాంటి సంబంధం లేదని అఖిలేష్ యాదవ్ కూడా స్పష్టం చేశారు.