హైదరాబాద్ లో ఘోర రోడ్డు ప్రమాదం
posted on Dec 31, 2019 @ 2:47PM
హైదరాబాద్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. విద్యార్ధులతో వెళ్తున్న ఓ ఆటోను లారీ ఢీకొంది. ఈ ఘటనలో ఒక విద్యార్థి చనిపోగా.. మరో నలుగురు విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు. వారిని వెంటనే స్థానిక ఆసుపత్రికి తరలించారు. లారీ ఢీకొనడంతో ఆటో మూడు పల్టీలు కొట్టి బోల్తా పడింది. ఇంటి నుంచి ఆడుతూ పాడుతూ బయలుదేరిన విద్యార్థులను లారీ రూపంలో మృత్యువు కబళించడంతో విషాదం చోటుచేసుకుంది. ఒక విద్యార్థికి తల భాగం బాగా దెబ్బ తినడంతో అక్కడికక్కడే ప్రాణాలు వదిలాడు.
ప్రమాదంకి గురైన వారు హబ్సిగూడలో ఉన్న భాష్యం స్కూల్ కి సంబంధించిన విద్యార్థులుగా గుర్తించారు. ప్రమాదం జరిగే సమయంలో ఆటోలో మొత్తం ఏడుగురు ముందు విద్యార్థులన్నారు.బ్యాంక్ కాలనీ నుండి హబ్సిగూడ స్ట్రీట్ నెంబర్ 8 వెళ్తున క్రమంలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఒక్కసారిగా లారీ సిగ్నల్ పడిన తరువాత దానిని గమనించకుండా, ఆటోను ఢీ కొట్టిన కారణాంగానే ఇంతటి ప్రమాదం చోటు చేసుకుంది. కేవలం లారీ డ్రైవర్ తప్పిదం కారణంగానే ఈ ప్రమాదం జరిగిందని స్పష్టంగా తెలుస్తొంది. సిగ్నల్ పడిన తర్వాత దాదాపు 20 మీటర్ల దూరం లారీ ముందుకు రావడంతో ఆటోను బలంగా ఢీ కొట్టింది. ఆటోలో ఉన్న అవంతి కుమార్ స్పాట్ లోనే చనిపోగా..తీవ్ర గాయాలతో ఉన్న వారందరిని ఉప్పల్ లో ఆదిత్య ఆసుపత్రి అలాగే మాట్రిక్స్ ఆస్పత్రి లో చికిత్స అందిస్తున్నారు. సీసీ కెమెరా పుటేజీ ఆధారంగా మొత్తం లారీ డ్రైవర్ తప్పిదం కారణంగా ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు గుర్తించారు.