షేక్ పేట్ లో పేలిన పెట్రోల్ బంక్.. భయాందోళనలో స్థానికులు
posted on Dec 31, 2019 @ 2:49PM
హైదరాబాద్ షేక్ పేట్ పెట్రోల్ బంక్ లో అగ్ని ప్రమాదం జరిగింది. ఓ కారులో పెట్రోల్ పోస్తుండగా మంటలు చెలరేగాయి. ఆ మంటలు బంక్ మొత్తం వ్యాపించగా, దీంతో దట్టమైన పొగలు అలముకున్నాయి. మంటలను ఆర్పేందుకు అగ్ని మాపక సిబ్బంది ప్రయత్నిస్తున్నారు. ఆ కారులో ఉన్న ప్రయాణికులు అందరూ కిందకు దిగిపోయారు. పెట్రోల్ పోస్తున్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకోవడంతో పెట్రోల్ నాజిల్ లో ఉన్న పెట్రోల్ కూడా అక్కడున్న పెట్రోల్ బంకుకు వ్యాపించింది. వెంటనే అప్రమత్తమైన సిబ్బంది తమ వద్ద ఉన్న అగ్నిమాపక సిబ్బందికి తెలియజేసారు.
అగ్రిమాపక శాఖ మంటలన్ని ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. కానీ అది పెట్రోల్ బంక్ కావడం.. పెట్రోలు భారీగా నిల్వ ఉండడంతో ఒక్క సారిగా మంటలు ఎగిసిపడుతున్నాయి. ఆ మంటలు పక్కన ఉన్న వేరే నాజీల్ తో వ్యాపించకుండా పెట్రోల్ బంక్ యాజమాన్యం చర్యలు తీసుకుంటున్నారు. కానీ ఆ మంటలు అదుపు లోకి రాకపోతే.. అతిపెద్ద ప్రమాదం జరిగే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. కింద ఉన్న ట్యాంకుల్లో భారీగా పెట్రోల్ స్తోరేజ్ ఉంటుంది. ఒకవేళ ఆ స్తోరేజ్ కి మంటలు వ్యాపిస్తే ఒక్కొక్కసారి బ్లాక్ట్ అయ్యే అవకాశం కూడా ఉంది. కానీ ఒక్కసారిగా పెద్దఎత్తున మంటలు వ్యాపించి ఉండటంతో పక్కనే నిర్మాణాలు, బిల్డింగులు కూడా ఉండటం తో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. మంటలు అదుపులోకి వస్తేనే ప్రమాదం నుంచి బయట పడే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నట్లు సమాచారం.