షర్మిల రాజకీయ శక్తిగా ఎదుగుతుందా ?
posted on Oct 13, 2012 @ 9:31AM
చంద్రబాబునాయుడుకు జనంలో వస్తున్న స్పందన చూసి గాభారా పడ్డ వైయస్సార్ కాంగ్రెస్ కూడా ప్రజలమద్యకు వెళ్లటానికి నిర్ణయించు కున్నారు. అందులో భాగంగానే ఈనెల 18నుండి మరో మహాప్రస్థానం పేరుతో 3000 కిలోమీటర్లకు రోడ్ మ్యాప్ తయారు చేసి, వైయస్సార్ కుమార్తె షర్మిళను రంగంలోకి దించారు. అయితే ఈ ప్రజాప్రస్దానం సుమారు సంవత్సరం వరకు జరుగుతుంది. దాంతో వైసిపి పార్టీలో ఉన్న నాయకులకు, ప్రజలకు, పార్టీ శ్రేణులకందరకూ షర్మిలానే నాయకురాలిగా తెలుస్తుంది. ఎప్పటికో విడుదలయ్యే వైయస్ జగన్ను పార్టీవర్గాలు, నాయకులు, ప్రజలు నాయకుడిగా అంగీకరిస్తారోలేదో అన్నది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. ఇదే సమయంలో వైసిపి వర్గాలు చేతనైతే చంద్రబాబునాయుడు ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం పెట్టాలంటూ పదేపదే వత్తిడి చేయటానికి కారణం రాష్ట్రంలో ప్రభుత్వాన్ని పడగొట్టి కేంద్రదాన్ని బ్లాక్ మెయిల్ చెయ్యటానికేనని తెలుగుదేశం పార్టీనేతలు అభిప్రాయపడుతున్నారు. ఏది ఏమైనా రానున్న రోజుల్లో వైయస్సార్ పార్టీలో నాయకత్వపు చిక్కులు తప్పవని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.