కాకినాడకు పొంచి ఉన్న ప్రమాదం......
posted on Oct 13, 2012 @ 9:33AM
ఒకవైపు జీవవైవిద్య సదస్సుజరుగుతున్నా, దానికి సంబంధించిన ప్రచారానికి మాత్రమే పెద్ద పీట వేస్తున్న ప్రభుత్వం క్రియలపై మాత్రం ఏమాత్రం శ్రద్ద చూపటం లేదు. అందుకు చాలా ఉదాహరణలు చెప్పుకోవచ్చు. అందులో ఒకటి కాకినాడ బీచ్ ప్రాంతాన్ని ఎన్నడూ లేని విధంగా గ్యాసు తవ్వకాలపేరుతో విచ్చలవిడిగా డ్రెడ్జింగ్ పనులతో సముద్రతీరానికి చేటు తెస్తున్నారు. కాకినాడ సముద్రంలో హోప్ ఐలాండ్ లో జరుగుతు ఈ డ్రెడ్జింగ్ పనుల వల్ల రానున్నరోజుల్లో ఏ ఉపద్రవం కాకినాడ సముద్రంలో చెలరేగినా కాకినాడ వాసులకు ముప్ఫు తప్పదు. ఇంతకు ముందు వచ్చిన సునామీ కాకినాడను తాకకుండా బయటపడటానికి కారణం హోప్ ఐలాండ్ వల్లనేనని శాస్త్రజ్ఞులు చెబుతున్నారు. ఇప్పటికే చేపలవేటకు వెళుతున్నజాలరులకు అక్కడ చేపలు ఏమాత్రం దొరకక వారిజీవనం దెబ్బతింది. అంతే కాకుండా రానున్నరోజుల్లో సముద్ర తీర ప్రాంతాలయిన ఉప్పాడ, ఏటిమొగ్గ, తదితర తీర ప్రాంతాలే కాకుండా కాకినాడ కూడా భారీ ప్రమాదానికి గురి అయ్యే ప్రమాదం ఉంది. ఇప్పటికే కాకినాడ సముద్ర మట్టంకంటే దిగువన ఉంది. ధీంతో ఈ ప్రాంతప్రజలతో పాటు కోస్తా తీర వాసులంతా కలవరపడుతున్నారు. కనుక ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలని ప్రజలు కోరుతున్నారు.