తెలంగాణాలో ప్రజాయాత్రలు జాన్తానై
posted on Oct 13, 2012 9:29AM
పవర్ కోసం మాత్రమే ప్రజయాత్రలు చేపడుతున్నారని అవి ఏ మాత్రం ప్రజలకు ఉపయోగపడవని తెలంగాణ వాదులు వివరిస్తున్నారు. 2014 జరగవలసిన ఎన్నికలకు ముందుగానే కోస్తాంద్రలోని మూడు ప్రధాన పార్టీలు అధికారం కోసం అర్రులు చాస్తూ ముందుకు పోతున్నాయని తెలంగాణ నాయకులు భావిస్తున్నారు. అధికార కాంగ్రెస్ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ మూడు నెలల ముందునుండి ఇందిరమ్మ బాటతో జిల్లాల యాత్రకు నడుంబిగించారు. దీన్ని చూసిన ప్రధాన ప్రతిఅక్షం అయిన తెలుగుదేశం పార్టీ అద్యఓడు చంద్రబాబునాయుడు మీకోసం వస్తున్నా అంటూ పాదయాత్ర మొదలు బెట్టారు. దీనికి వస్తున్న ప్రతిస్పందనను చూసి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఈ నెల 18 నుండి మరో ప్రస్థానం పేరుతో ఇడుపుల ఫాయనుండి ఇచ్చాపురం వరకు 3000 కిలోమీటర్ల పాదయాత్రను చేపట్టనున్నారు. వైసిపి నేత జగన్ చెంచల్ గూడ జైల్లో ఉన్నందున సోదరి షర్మిల మొదలు పెట్టనున్నారు. అయితే ఈ పోటాపోటీ యాత్రలన్నీ సీమాంద్రలోనే చెల్లుతాయని, తెలంగాణపై స్పష్టమైన వైఖరి స్పష్టం చేయకుండా ఆయా పార్టీలు తెలంగాణకు వస్తే నిరసన తప్పదని, వారిని తెలంగాణ ప్రజలు తరిమి కొడతారని, తెలంగాణవాదులు హెచ్చరిస్తున్నారు.