ఫైర్ బ్రాండ్ తీరుపై విమర్శలు
posted on Oct 23, 2012 @ 2:58PM
రేణుకా చౌదరి వ్యవహారం ఈ మద్య ఎందుకో పలు విమర్శలకు తావిస్తుంది. ఫైర్ బ్రాండ్ గా పేరు తెచ్చుకున్న ఆమె శైలి వివాదాస్పదమవుతుంది. గతంలో యస్సి, యస్టీ స్టూడెంట్స్ తన కారుకు అడ్డుగా వచ్చి మెస్ చార్జీలను, స్కాలర్ షిప్పులను పెంచాలని డిమాండ్ చేస్తే పరిశీలిస్తాననో లేదా సంబంధిత అధికారులతో మాట్లాడతాననో చెబితే సరిపోయేది. కాని ఎప్పుడు అడగాలో ఎలా అడగాలో తెలియదా అంటూ వారిపై విరుచుకు పడ్డారు. హర్యానాలో ఆడవాళ్లపై అరాచకాలు ఎక్కువవుతున్నాయని మీడియా గొంతు చించు కుంటే మహిళా సంఘాలన్నీ స్వరాలు కలిపితే, సామాజిక వేత్తలంతా ఆడపిల్లలకు భద్రత పెంచాలని గొడవ పెడుతుంటే తాను మాత్రం ఇది సాధారణ విషయమేనని, ప్రపంచం అంతటా జరుగుతున్న లా అండ్ ఆర్డర్ సమస్యేనని తేలికగా తీసివేసి పలు విమర్శల పాలయ్యారు. అలాగే తాజాగా ఖమ్మం కలెక్టరేట్ లో జాయింట్ కలెక్టర్ తో గిరిజనేతరులకు పహాణీలు ఎందుకివ్వలేదని జెసి నాయక్ తో వాగ్వివాదం జరపటమేకాక, రైతులను రెచ్చగొడుతూ పురుగు మందులు తాగమనడం వివాదం అయ్యింది. గిరిజనులకు చెందిన భూమి గిరిజనేతరులకు ఇవ్వడం చట్టవిరుద్దం అని ఎంత చెప్పినా వినకుండా కలెక్టర్ ను దూషించడం, అలాగే కార్యకర్తలను, రైతులను రెచ్చగొట్టి దాదాపు జెసి పై దాడి చేయించినంత పని జరగడంతో తన సమకంలోనే జెసిని కార్యకర్తలు దుర్బాషలాడుతున్న వారించకపోవడం పలువిమర్శలకు తావిచ్చినట్లయింది.