ఫవర్ ఫుల్ కాని, పనులు నిల్
posted on Oct 23, 2012 @ 3:00PM
ఇదో వింతైన తీరు ఎక్కడైనా అధికారంలో ఉండే పార్టీనే తమ నేతల పనులకు నియోజక వర్గాలకు పనులు చేసి పెడుతారు. అధికార పక్షంలో ఉండే సర్పంచ్ కూడా తన ఊరికి చెందిన పనులు చకచకా చేయించు కోవచ్చునని సంబర పడుతారు. కాని మన రాష్ట్రంలో పరిస్ధితులు ఇందుకు పూర్తిగా భిన్నం. సాకాత్తూ మంత్రులు, ఎమ్మేల్యేలే పనులు జరిపించుకోలేక పోతున్నారు. మంత్రులు పరిశీలించి పెట్టిన నోట్ ల మీద లేదా తత్ సంభందిత ఫైల్సు మీద సంతకాలు చేయకుండా నెలలు, సంవత్సరాలు ముఖ్యమంత్రి పెండింగ్ లో పెడుతుంటే నియోజకవర్గాలకు వెళ్లటానికి మంత్రులకే భయమేసి హైదరాబాద్ దాటి వెళ్లటం లేదు. అయితే ప్రతిఅక్షాలకు చెందిన నేతలు ఫోన్ చేస్తే చాలు నిముషాల్లో పనులయిపోవడమే కాక ఫోన్ చేసి అధికారులు అయ్యా తమరి పని చేసేసామని చెబుతుంటే అదికార ఎమ్మేల్యేలకు, మంత్రులకు ఏం చెయ్యాలో తెలియక తలలు పట్టుకుంటున్నారు. ఖమ్మం జిల్లాకు చెందిన నామా నాగేశ్వరావు కున్న పలుకుబడి అధికార నేతలకు లేదు. ఖరీఫ్ పంటకు నీళ్లు వదలాలని ఎంత మొత్తుకున్నా కాంగ్రెస్ నాయకులు గాని అదికారలు గాని పట్టించు కున్న ఫాపాన పోలేదు. అయితే రబీ పంటకు నీళ్లు వదలాలి అనంగానే నాగార్జున సాగర్ ఎడమ కాలువలోకి నీళ్లు వదిలటమే కాక పోన్ చేసి మరీ చెప్పారు. అలాగే ఖమ్మం జిల్లాలోకి ముఖ్యమంత్రిని రానివ్వ మంటూ తెలుగుదేశం నాయకులు పట్టు బడితే ముందు రోజు రాత్రికే వారి కోరికలన్నీ నెరవేర్చి ఖమ్మం జిల్లా చేరుకున్నారు కిరణ్ కుమార్ రెడ్డి . నల్గొండ, ఖమ్మం, మహబూబ్ నగర్ లదంతా ఇదే తంతు. దాంతో ఇక్కడి అధికార నేతలు ప్రజలకు ఏం చెప్పాలో తెలియక సతమత మవుతున్నారు.