కేంద్రమంత్రి ఆదేశాలను భేఖాతరు చేసిన సర్కార్
posted on Oct 22, 2012 @ 2:37PM
కేంద్ర గిరిజన శాఖ మంత్రి కిషోర్ చంద్రదేవ్ రాష్ట్రంలోని గిరిజనులు నివసించే అటవీభూముల్లో బాక్సైట్ తవ్వకాలను నిలుపు చేయాలంటూ రాష్ట్ర ముఖ్యమంత్రికి పంపిన ఉత్తర్యులను అమలు చేయకపోవడం పై మండి పడుతున్నారు. ఆరునెలల ముందు రాష్ట్ర గవర్నర్ కు ఈవిషయమై ఒక లేఖను కూడా సంధించారు. అయితే గిరిజనులకు అడ్డంకులు తేవద్దంటూ కేవలం ఒక ప్రసంగంలో చెప్పి అంతకు మించి ప్రయత్నాలేవీ గవర్నర్ చేయక పోవడంతో తనే రంగంలోకి దిగినట్లు తెలుస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం తమ ఉత్తర్యులకు స్పందించకుండా ఉంటే త్వరలో తనకున్న అధికారాలను ఉపయోగించడానికి ఆయన సిద్దంగా ఉన్నట్లు తెలిసింది. అయితే ఈ వ్యవహారంతో రాష్ట్రప్రభుత్వం తమ ఆదాయాన్ని కోల్పోతుందని, ఇప్పటికే రాష్ట్ర ఆర్దిక పరిస్దితి బావుండలేదని అందుకే అమలు చేయడం కష్టమని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తుంది. చట్ట ప్రకారం ఆదీవాసీల హక్కుల పరిరకణకు తాను కట్టుబడి ఉన్నానని తాత్కాలిక ప్రయోజనాలకోసం శాశ్వత ప్రయోజనాలను ఫణంగా పెట్టకూడదని కేంద్రమంత్రి సర్కార్ కు తేల్చి చెప్పారు. రానున్న రోజుల్లో ఈ వివాధం ఏపరిస్థితులకు దారి తీస్తుందోనని పారిశ్రామిక వర్గాలు కలవర పడుతున్నాయి