ఎమ్మెల్యేగా పోటిచేస్తా : కంఠమనేని రవిశంకర్
posted on Dec 8, 2012 @ 1:21PM
రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో టిడిపి 'బి' ఫారం సాధించి అవనిగడ్డ నియోజక వర్గం నుంచి పోటిచేస్తానని కంఠమనేని రవిశంకర్ గారు తెలిపారు. స్థానిక నాయకులతో సమావేశం నిర్వహించారు. తెలుగుదేశంపార్టీకి అత్యధిక ఓటుబ్యాంకు కలిగిన మండలం కోడూరు అని అన్నారు. రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు నిర్వహిస్తున్న "మీకోసం పాదయాత్ర" కు మద్దతుగా జనవరిలో మండల పార్టీ అధ్యక్షుడు బండే శ్రీనివాస్ రావు ఆధ్వర్యంలో పాదయాత్ర చేపట్టనున్నట్లు ప్రకటించారు.
పార్టీ అభివృద్దికి కృషిచేస్తున్న 'బండే' ను హతమర్చేందుకే కొందరు నేతలు ప్రణాళికలు వేస్తున్నట్లు ఆరోపించారు. మండలంలో గ్రూప్ రాజకీయాలకు స్వస్తి చెప్పి పార్టీ అభివృద్దికి అందరూ ఐక్యంగా పనిచేస్తున్నారని కితాబిచ్చారు. ఉల్లిపాలెంకు చెందిన అరిక రాజ రాష్ట్ర స్థాయిలో ఎఇఇఇలో 134వ ర్యాంక్ సాధించి వసతి గృహంలో ఉంటున్న౦దున ఖర్చుల నిమిత్తం పార్టీ తరుపున 20వేల చెక్కును అందించారు.
ఈ కార్యక్రమంలో బండే శ్రీనివాస్ రావు, ఉప్పాల పోతురాజు, బత్తిన వెంకటచలం, పెద్ది గోపాలస్వామి, గోగినేని సోమశేఖర రావు, వేములపల్లి రాజేష్ తదితరులు పాల్గొన్నారు.