పురందేశ్వరి, చంద్రబాబుల మధ్య మాటల యుద్ధం
posted on Dec 8, 2012 @ 1:35PM
పార్లమెంట్లో దివంగత ఎన్ టి ఆర్ విగ్రహాన్ని ప్రతిష్టించే విషయంలో తెలుగు దేశం అధినేత చంద్ర బాబు నాయుడు, కేంద్ర మంత్రి పురందేశ్వరి ల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ఈ విషయంలో చంద్ర బాబు మొదటి నుండి రాజకీయాలు చేస్తూ, తన ప్రతిష్టకు భంగం కలిగే విధంగా వ్యవహరిస్తున్నారని పురందేశ్వరి స్పష్టం చేశారు.
ఇదే విషయం ఫై ఆమె ఎన్ టి ఆర్ అభిమానులకు ఓ బహిరంగ లేఖ రాసారు. విగ్రహ ప్రతిష్టాపన లో ఉన్న వాస్తవాలను గ్రహించాలని ఆమె వారికి సూచించారు. విగ్రహాన్ని ప్రతిష్టించడానికి తాను అడ్డుపడుతున్నానని చంద్ర బాబు, ఆ పార్టీ నాయకులు మొదటి నుండి ఆరోపణలు చేస్తున్నారని ఆమె విచారం వ్యక్తం చేస్తున్నారని ఆమె అన్నారు.
ప్రజల దృష్టిలో తనను దోషిగా నిలిపెందుకే ఆయన అలా చేస్తున్నారని పురందేశ్వరి అన్నారు. ఇప్పుడు విగ్రహాన్ని ప్రతిష్టించే అవకాశం వచ్చినా, అందుకు సంతోషించకుండా ఆరోపణలు చేయడం ఏమిటని మంత్రి ప్రశ్నించారు.
బాబు ముఖ్యమంత్రి గా ఉన్నపుడు ఈ విషయాన్ని పట్టించుకోలేదని, ఆ సమయంలో తాను విగ్రహం ఇస్తానని ముందుకు వచ్చినప్పుడు, హడావిడిగా ఎర్రం నాయుడుతో లేఖ ఇప్పించారని ఆమె గుర్తు చేశారు.