ఢిల్లీ గ్యాంగ్ రేప్ భాదితురాలికి న్యాయం చేయాలి: ఎంపీ రాథోడ్ రమేష్
posted on Dec 24, 2012 @ 6:19PM
ఢిల్లీ లో మెడికల్ విద్యార్ధిని పై గ్యాంగ్ రేప్ జరగటం చాల దారుణమని టిడిపి ఆదిలాబాద్ ఎంపీ రాథోడ్ రమేష్ అన్నారు. నిందితులపై కటినచర్యలు తీసుకొని వెంటనే భాదితురాలికి న్యాయం చేయవలసిందిగా డిమాండ్ చేశారు. విద్యార్డులపై పోలీసుల లాటీ చార్జీలు, బాష్ప వాయు ప్రయోగాలు చేయడం చాలా ఘోరమని అన్నారు. కాంగ్రెస్ పాలనలో ప్రజలకు రక్షణ కరువైందన్నారు. తమ పార్టీ అధికారంలోకి వస్తేనే ప్రజల కష్టాలు కడతేరుతాయన్నారు.
2014 ఎన్నికల్లో తమ పార్టీయే అధికారంలోకి వస్తుందని ఎంపీ రాథోడ్ రమేష్ అన్నారు. తమ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు చేపట్టిన వస్తున్నా మీ కోసం పాదయాత్రకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని, కాంగ్రెస్ పాలన నుంచి విముక్తి కావాలని కోరుకుంటున్నారన్నారు. కుంభకోణాలు మినహాయిస్తే ప్రభుత్వం సాధించింది శూన్యమని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పాలనపై ప్రజలు విసుగు చెందారని ఎప్పుడు ఎన్నికలు వచ్చినా తమ పార్టీని గెలిపించేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. తెలంగాణకు మొదటి నుంచి తమ పార్టీ అనుకూలమని చెబుతున్నప్పటికీ ప్రజాదరణ లేని కొన్ని పార్టీలు తమ పార్టీపై తప్పుడు ప్రచారం చేస్తూ ప్రజలను మభ్యపెడుతున్నాయన్నారు.