రేపిస్టులకు మరణ దండన కూడదు: కమల్

 

కోలివుడ్ సూపర్ స్టార్ కమల్ హస్సన్, క్రిందటి ఆదివారం డిల్లీలో జరిగిన సామూహిక అత్యాచారం సంఘటనపై స్పందిస్తూ, అటువంటి నేరాలను క్షమించరాని నేరాలుగా వర్ణిస్తూనే, రేపిస్టులకు మరణ దండన విదించడం ఎంతమాత్రం సబబుకాదని అన్నారు. ఒక నేరానికి శిక్షగా మరణదండన విదించడమంటే మరో నేరం చేస్తునట్లే లెక్క అని అన్నారు. మరణదండనని చట్టబద్ధమయిన మరో నేరంగా ఆయన అభివర్నించేరు. గానీ, అదే కమల్ హస్సన్ తన సినిమాలో (భారతీయుడు) అనేక నేరస్తులకి, చివరకి తన కుమారుడుకి కూడా మరణశిక్షే న్యాయమని మనస్పూర్తిగా నమ్మి అమలు చేస్తాడు. అంటే, తన సినిమాసూత్రాలు నిజజీవితానికి పనికిరావని అతని అభిప్రాయం అనుకోవాలా? లేక తానూ నమ్మని సూత్రాలను డబ్బుకోసం సినిమాలలో చేసిచూపాడని అనుకోవాలా?

Teluguone gnews banner