గాంధీ ఆసుపత్రిలో రోగుల ఇక్కట్లు
posted on Aug 23, 2012 @ 10:22AM
జూనియర్ డాక్టర్ల సమ్మెతో గాంధీ ఆసుపత్రిలో రోగులు ఇక్కట్ల పాలవుతున్నారు. జూనియర్ డాక్టర్లు ఎమర్జెన్సీ సేవలను కూడా బహిష్కరించారు. ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసినా సరిపోకపోవడంతో రోగులు నానా అగచాట్లు పడుతున్నారు. ఈ ఉదయం పోలీసులు గాంధీ ఆసుపత్రిలో ఫర్నీచర్ ధ్వంసం చేసి డాక్టర్లపై చేయి చేసుకున్న ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు.