యర్రబెల్లికి సిఎం ఫోన్
posted on Aug 23, 2012 @ 10:03AM
రాష్ట్రంలో కరెంట్ కోట్లపై టిడిపి ఎమ్మెల్యేలు చేస్తున్న నిరసనదీక్షను భగ్నం చేసిన పోలీసులు టిడిపి ఎమ్మెల్యేలను బలవంతంగా వారి వారి ఇళ్ళవద్ద విడిచిపెట్టారు. నేడు టిడిపి ఎమ్మెల్యేలు రాష్ట్ర ముఖ్యమంత్రిని కలవడానికి బయలుదేరారు. న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్ వద్ద పోలీసులు టిడిపి ఎమ్మెల్యేలను గేటు దాటి బయటకు రానివ్వకుండా కట్టడి చేయడంతో వారు ఎమ్మెల్యే క్వార్టర్స్ వద్దే బయతాయించి నిరసనలను తెలుపుతున్నారు. సిఎం క్యాంప్ ఆఫీస్ వద్ద టిడిపి ఎమ్మెల్యే మహేందర్ రెడ్డి, రత్నం లను పోలీసులు అరెస్ట్ చేసారు. క్యాంప్ ఆఫీస్ నుండి సిఎం కిరణ్ కుమార్ రెడ్డి ఎర్రబెల్లి దయాకర్ కు ఫోన్ చేసి నిరసనలను నిలపాలని కోరారు. ఎర్రబెల్లి సిఎం కిరణ్ కు టిడిపి యొక్క డిమాండ్ లను తెలిపినట్లు సమాచారం.