తెలంగాణా జర్నలిస్టులపై కక్ష ఎందుకు?
posted on Oct 18, 2012 @ 9:58AM
దేశ ప్రధాని మన్మోహన్‌సింగ్ హైదరాబాద్ పర్యటన సందర్భంగా కవరేజీకి వెళ్లిన తెలంగాణా విలేకరులను, నమస్తే తెలంగాణా విలేకరులను పోలీసులు ఎందుకు అనుమతించలేదు? ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశం అయి ఉంటే సమాచారశాఖ ద్వారా తెలియజేయాలి కానీ, పోలీసులు ఎందుకు ప్రత్యక్షజోక్యం చేసుకున్నారు? మనపత్రిక, మన ఆత్మగౌరవం నినాదంతో ‘నమస్తే తెలంగాణా’ తెలంగాణా ప్రాంతంలో ఓ కీలక భూమిక నిర్వహిస్తోంది. అటుతెలంగాణా ఉద్యమంలోని అన్ని అంశాలతో పాటు జాతీయ, అంతర్జాతీయ, రాష్ట్రీయ అంశాలకు ఆ పత్రికలో చోటు కల్పించింది. అటువంటప్పుడు కత్తి మీద సాములాంటి జర్నలిస్టులను పోలీసులు, ప్రభుత్వాలు సరైన కోణంలో ఎందుకు చూడటం లేదు? దీంతో తెలంగాణా జర్నలిస్టులను వేరుగా చూసే పని పోలీసులది కాదు కదా! అలా ఎందుకు చూశారు? దీని వెనుక ఉన్న పాత్రధారులను బయటపెట్టాలని ఆ పత్రిక జర్నలిస్టులు బ్లాక్‌డేను పాటించారు. తమ వెబ్‌సైట్‌లో కూడా నల్లరంగును ప్రదర్శించటం ద్వారా నిరసన వ్యక్తం చేశారు. జాతీయ, అంతర్జాతీయ మీడియా ఈ నిరసనకు సంఫీుభావం ప్రకటించింది. సచివాలయం 'సి' బ్లాకు వద్ద జరిగిన ఈ నిరసన కార్యక్రమంలో పాల్గన్న కొందరు పాత్రికేయులను పోలీసులు అరెస్టు కూడా చేశారు. ఈ ఘటనపై విచారణ జరిపిస్తానని సమాచార శాఖామంత్రి డికె అరుణ తెలిపారు.