సింగరేణి కార్మికులకు అన్యాయం జరిగిందా?
posted on Oct 18, 2012 @ 9:59AM
ప్రభుత్వ నిర్వహణలో లాభాల బాట పట్టే పరిశ్రమల సంఖ్య నానాటికీ తగ్గుతోంది. ఇటువంటి తరుణంలోనూ సింగరేణి పరిశ్రమ రాష్ట్ర ప్రభుత్వానికి ఆశావహంగా నిలుస్తోంది. ప్రతీఏడాది లాభాలబాట పట్టి క్రమశిక్షణకు పెద్ద నిదర్శనంగా కనిపిస్తోంది. ఈ విషయాన్ని గమనించి 1999`2000లో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కార్మికులకు లాభాల వాటాను ప్రకటించారు. వచ్చిన లాభంలో కొంత కార్మికులకు చేరే ఈ అవకాశం (అప్పటి నుంచి సుమారు 12ఏళ్లుగా) కొనసాగుతోంది. కాంగ్రెస్ ప్రభుత్వం కూడా కొనసాగించటం పట్ల ఎందరో అభినందనలు తెలియజేస్తున్నారు. ఈ ఏడాది రాష్ట్ర ప్రభుత్వం 17శాతం లాభాల వాటాను కార్మికులకు ప్రకటించింది. అయితే కార్మికులు ఈ ఏడాది వాటా బాగా పెరుగుతుందని ఆశించారు. కార్మిక గుర్తింపు సంఘ ఎన్నికల్లో సిఐటియు అయితే 25శాతం లాభాలవాటా సాధిస్తానని హామీ ఇచ్చింది. ఇటు ఐఎన్‌టియుసి, సిఐటియు రెండు యూనియన్లూ ప్రభుత్వంతో ఒప్పందాల్లో ఘనమైన పాత్ర పోషించేవి. ఆ రెండు యూనియన్లలో ఏ ఒక్క సంఘం గెలిచినా వాటా పెరిగి ఉండేదని కార్మికులు అనుకుంటున్నారు. తెలంగాణాప్రాంతీయ సంఘానికి ఇచ్చిన ప్రాధాన్యత వల్ల టిబీజికేఎస్ గుర్తింపు సంఘంగా గెలుపొందింది. తాము మళ్లీ అదనపు వాటా కోసం పోరాడతామని ఆ యూనియన్ నాయకులు చెప్పారు.