కేసిఆర్ ఢల్లీ లాబియింగ్‌పై హారీష్‌కు అనుమానాలు
posted on Oct 18, 2012 @ 9:48AM
ప్రత్యేక తెలంగాణా రాష్ట్రం ఇప్పట్లో తేలే అంశంలా కనిపించటం లేదు. కేవలం టిఆర్‌ఎస్ అధినేత కేసిఆర్ మినహా మిగిలిన వారెవరూ ప్రత్యేకతెలంగాణాకు అనుకూలంగా మాట్లాడటం లేదు. ఇప్పటి దాకా కేసిఆర్ తాను చర్చలు జరిపామని చెబుతున్న ఎఐసిసి నేత వాయలార్ రవి, రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌ఛార్జి గులాంనబీ ఆజాద్ వంటి ప్రముఖులు కూడా తెలంగాణాకు అనుకూలంగా ఒక్క మాట కూడా మాట్లాడలేదు. పైగా, తెలంగాణాను వ్యతిరేకిస్తూ వీరిద్దరూ చేసిన వ్యాఖ్యలు రాష్ట్రంలో పెద్ద చర్చనీయాంశమయ్యాయి. ఆజాద్ అయితే నేరుగా సిఎం నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వానికి మద్దతు తెలిపారు. వాయలార్ రవి తన మాటల్లో ప్రత్యేకతెలంగాణాకు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేశారు. ఇది ఇలా ఉంటే కేసిఆర్ కాంగ్రెస్ లాబీని నమ్ముతున్నారు. కేసిఆర్ మేనల్లుడు హరీశ్‌రావు మాత్రం తనకేమీ పట్టదన్నట్లు కాంగ్రెస్‌ను దునుదుమలాడున్నాడు. కేసిఆర్ ఢల్లీ లాబీయింగు హరిశ్‌రావు కూడా నమ్మడం లేదు. దీంతో ఒకవైపు కాంగ్రెస్ అధిష్టానంలోని నేతలు కూడా కేసిఆర్ సహన్ని పరీక్షిస్తున్నారు. తాజాగా జెఎసి బృందం కూడా ప్రత్యేక తెలంగాణాపై పెదవి విరిచింది. లాబీయింగ్‌పై కేసిఆర్‌కు ఉన్న నమ్మకం దృష్ట్యా అలా మాట్లాడుతున్నారని సర్దుకుంది.