వై పోలీస్ ఫెయిల్ కి అనుమతి నివ్వాలి
posted on Oct 22, 2012 @ 2:33PM
రాజకీయాలు అన్ని ప్రభుత్వ విభాగాల్లోనూ కేన్సర్ లా ఆక్రమించిన విషయం తెలిసిందే. అయితే పోలీస్ వ్యవస్ధ దీని బారిన పడినట్లు ఇంకే విభాగం పడలేదన్నది జగమెరిగిన సత్యం. ఎందరో నియమ నిబద్దత గల పోలీసులు, పోలీసు ఆఫీసర్లు రాజకీయనాయకుల వత్తిళ్లకు తలొగ్గకుండా చట్టం ముందు అందరూ సమానమే నని పని చేసే వాళ్లు తమ కేరీర్ విషయంలో ఎంతగా నష్ట పోతున్నారో తెలియాలంటే వై పోలీస్ ఫెయిల్ కి అనుమతి నివ్వాలని పోలీసులు కోరుతున్నారు. దీని వల్ల రాజకీయ నాయకులు పోలీసుపై చేసే ఒత్తిడులు, మాటవినని వారికి వారు చేసే అవమానాలు, అవహేళలే కాకుండా పని చేయని పోలీసులుగా ముద్రవేసి ట్రాన్స్ ఫర్లు చేయడం, సెలవులపై పంపడం వంటివి తెలియాలని, అందుకు వినయ్ కుమార్ సింగ్ రాసిన వై పోలీస్ ఫెయిల్ పుస్తకానికి రాష్ట్ర ప్రభుత్వం అనుమతినివ్వాలని కోరింది. అలా ఇవ్వని పక్షంలో ప్రజలకు సరైన సేవలు అందించడం కుదరదని వారు తెలిపారు. భూపతి బాబునుండి , గౌతం కుమార్ వరకు వివిధనాయకుల వల్ల సెలవులపై వెళ్లటం, వి ఆర్ యస్ తీసుకోవడం ఇందులో పొందుపరచారని తెలుస్తుంది. ప్రజలకు సరైన పోలీసు సేవలు అందించాలంటే వై పోలీస్ ఫెయిల్ ప్రజల ముందుకు రావాల్సిందేనని పోలీసు ఉన్నతాదికారులు కోరుతున్నారు.