పండుగలను మిస్ అవుతున్న ప్రధానప్రతిపక్షాలు
posted on Oct 22, 2012 @ 2:30PM
పండగలంటే రాజకీయ నాయకులకు ఎంతో సంతోషం ఎందుకంటే కనీసం వారు ఆరోజన్నా కుటుంబ సభ్యులతో గడపవచ్చని అయితే పాదయాత్రలపేరుతో ప్రజల మద్యనున్న ప్రధాన ప్రతిపక్షాలయిన తెలుగుదేశం, వైకాపా లు పండుగకు దూరం అవుతున్నారు. ఈనెల 24 జరుగనున్న దసరా, 27న బక్రీద్, నవంబరు 13న దీపావళి, డిసెంబర్ 25న క్రిస్మస్ జనవరి 14 తెలుగువారందరికి పెద్ద పండుగయిన సంక్రాంతికి వారు దూరమవుతున్నారు. తెలుగుదేశం నేత చంద్రబాబునాయుడు దసరారోజు ఉదయం పార్టీనేతల అభినందనలతో మద్యాహ్నంనుండి కుటుంబసభ్యులతో గడపనున్నారు. ఇప్పటివరకు 380 కిలోమీటర్ల పాదయాత్ర పూర్తి చేశారు. అనంతపురం, కర్నూలు జిల్లాలు పూర్తి చేసుకొని మహబూబ్ నగర్ జిల్లాలో కాలుపెడుతున్నారు. నిత్యం పార్టీ కార్యక్రమాలతో బిజిగా వుండే చంద్రబాబు ఒక్క ఆదివారం మత్రమే కుటుంబసభ్యులతో గడుపుతారు. అయితే బాగా ముఖ్య కార్యక్రమాలు ఉన్న ఆదివారం సాయంత్రం పూట ఖచ్చితంగా ఇంట్లో వుండేలా చూసుకుంటారు. అయితే పాదయాత్ర సందర్భంగా ఆయన జనం మద్యనే ఉంటున్నారు. అయితే ఈసారి చంద్రబాబు పెద్దపండుగలన్నిటినే త్యాగం చేశారు. అన్నిటిని ఆయన ప్రజల మద్యనే జరుపుకోవలసి వస్తుంది. జనవరి 26 వరకు అదే పరిస్థితి కొనసాగనుంది. వైకాపా తరుపున పాదయాత్ర చేస్తున్న షర్మిల తమ ముఖ్య పండుగలయిన క్రిస్మస్, జనవరి ఫస్టును ప్రజల మద్యనే జరుపుకోనున్నారు. క్రిస్మస్ ను మామూలుగా అయితే బెంగుళూరు లో జరుపుకునేవారు. అయితే వైయస్ మరణానంతరం ఇడుపుల పాయలో జరుపుకుంటున్నారు. మామూలుగా హిందూ పండుగలు ఆచరించని షర్మిల కుటుంబం పండుగ సందర్బంగా వచ్చే పార్టీనేతలను మాత్రం కలుస్తుంటారు.