అత్తమీద కోపం దుత్త మీద చూపుతున్నారు
posted on Oct 22, 2012 @ 2:34PM
కేంద్ర అధినాయకత్యం ప్రత్యేక తెలంగాణ మీద ఏమాత్రం శ్రధ్ద చూపటం లేదు దాంతో ప్రజలకు ఏ సమాధానం చెప్పాలో తెలియక ఫ్రస్టేషన్ ఫీలయ్యిన తెలంగాణ నాయకత్యం సినిమాల మీద, నాయకుల మీద తమ ప్రతాపం చూపుతున్నారని ఆంధ్రనాయకులు, తెలంగాణ నాయకులు చెబుతున్నారు. దానిలో భాగంగానే కెమేరా మెన్ గంగతో రాంబాబు సినిమాను అడ్డుకున్నారని వారు చెబుతున్నారు. అలాగే ఏదో విధంగా ప్రజల్ని తమ చెప్పు చేతల్లో ఉంచుకునేందుకే కాంగ్రెస్, తెలుగుదేశం, వైసిపి నాయకులు తమ ప్రాంతాలకు వచ్చినప్పుడు వారిని రెచ్చ కొట్టి ఆంద్రనాయకులను అడ్డుకుంటున్నారని తెలంగాణకు చెందిన కొంత మంది నాయకులు బాహాటంగానే చెబుతున్నారు. అన్ని పార్టీలను కలుపుకు పోయి తెలంగాణ తెచ్చుకునేందుకు ప్రయత్నించకుండా వారిని నిలువరించే ప్రయత్నంలో తమకు తామే చేటుతెచ్చుకుంటున్నారని వారు అభిప్రాయ పడుతున్నారు. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం దగ్గర పరువు పోగొట్టుకున్న తెలంగాణ నాయకులు త్వరలో ప్రజల మద్యకు వెళ్లటానికి కూడా ఇబ్బందులు పడే పరిస్దితులు తెచ్చుకుంటున్నారని వారు చెబుతున్నారు. కాబట్టి ఇకనైనా తెలంగాణా వాదాన్ని ముందుకు తీసుకెళ్లి ప్రత్యేక రాష్ట్రంగా తీసుకురావడానికి మరింత ముందుచూపుతో వ్యవహరించాలని తాలంగాణకోసం పనిచేస్తున్న మరొక వర్గం వారు చెబుతున్నారు.