అంతిమ లక్ష్యం....!
posted on Oct 2, 2012 @ 10:00AM
నేడు ఎవరు ఎటువంటి ఉద్యమాన్ని నడిపినా దాని అంతిమ లక్ష్యం రాజకీయ అధికారమేనన్నది దేశంలో నేడు జరుగుతున్న పలు సంఘటనలను బట్టి తెలుస్తోంది. అవినీతికి వ్యతిరేకంగా పోరు సల్పుతూ యువతలో, ప్రజల్లో అవినీతిపై ఓ అవగాహన కల్పించి, ప్రభుత్వాన్ని ప్రశ్నించే దిశగా అడుగులువేస్తున్న సమయంలో అన్నా హజారే బృందంలోని అరవింద్ క్రేజీవాల్ స్వంత పార్టీపై తనకు గల సందేహాలను నివృత్తి చేయమని అన్నా హజారే కోరినా కేజ్రీవాల్ జవాబులు ఇవ్వలేదట! దీన్ని బట్టి ఇందులో రెండుకారణాలుండవచ్చని ప్రజలనుకుంటున్నారు. ఒకటి` అవినీతి అంటని పార్టీ లేదు.. అవినీతి లేని పార్టీలేదు.. అందుకే అవినీతికి వ్యతిరేకంగా పోరాడుతున్న అన్నా హాజారే బృందాన్ని బ్రిటీష్‌వారి తరహాలో విభజించు పాలించులా విడదీసేందుకు క్రేజీవాల్‌ను ఓ పావుగా వాడుకుంటున్నారన్నది ఒకటయితే.. రెండోవది` అవినీతిపై పోరాటంలో ప్రజల నుండి వచ్చిన విశేష స్పందనను రాజకీయంగా ఉపయోగించుకుంటే ఓ నేతగా ఎదగవచ్చునన్న క్రేజీవాల్ బృందం ఆశే ఈ పార్టీ రూపకల్పనకు కారణం కావచ్చన్నది రెండోవది. ఏదేమైనా ... నిజానికి నిజాయితీ విలువలు తగ్గిపోతున్నాయి. నిజాయితీపరులను బ్రతికున్నప్పుడు చచ్చేవరకు చచ్చేలా సతాయిస్తారు.. చచ్చినతర్వాత.. బ్రతికుండాలని కోరుకుంటారు? ఇవా దేశాన్ని ప్రగతిపథం వైపు తీసుకుపోయే రాజకీయాలు.. ఇటువంటి రాజకీయాల్లోనా కాస్తోకూస్తో.. ప్రజలంటే అభిమానం.. ప్రజలకు వారిపై అభిమానం ఉన్న నాయకులు రావడం... దీని పర్యవసానం.