బొత్స సక్సెస్ అవుతారా
posted on Oct 26, 2012 @ 3:10PM
రాష్ట్ర ముఖ్యమంత్రికి , ఉపముఖ్యమంత్రికి జరుగుతున్న వార్ తో మద్యన బొత్స నలిగిపోతున్నారు. కిరణ్ కుమార్ ఒంటెద్దు పోకడ పార్టీకు దెబ్బ అని ఎంత చెప్పినా అర్దం చేసుకోవడం లేదని, రానున్న ఎన్నికలను దష్టిలో పెట్టుకొని మంత్రులను పార్టీ వర్గాలను కలుపుకు పోవాలని ఎంత చెప్పినా కిరణ్ కుమార్ ప్రవ ర్తనలో మార్పు రావడం లేదని పిసిసి ప్రసిడెంట్ బొత్స వాపోతున్నారు. ఇంతకు ముందు కూడా మెదక్ జిల్లా ఇందిరమ్మ బాటకు ఇదే విధంగా రాజనర్శింహకు ముఖ్యమంత్రికి అభిప్రాయ తేడాలు రావడం వల్లే ప్రకాశం జిల్లా పర్యటనకు వెళ్లటం తెలిసిందే. ప్రస్తుతం వీరిద్దరికీ సయోద్య కుదిర్చే పనిలో పడ్డ బొత్సకు దామోదర పట్టుదలతో బొత్స ఇరుకున పడుతున్నారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ తలపెట్టిన మెదక్ జిల్లా ఇందిరమ్మ బాటకు వెళ్లవలసిందిగా బొత్స ఉపముఖ్యమంత్రిని కోరారు. అయితే తనకు తెలియకుండా కిరణ్ రూట్ మ్యాప్ ను తన జిల్లాలో తయారు చేయించడం తగదని అందుకే తాను ఇందిరమ్మ బాటకు వెళ్లే ప్రశ్నే లేదని దామోదర తెగేసి చెబుతున్నారు. దీంతో మెదక్ జిల్లాలో ఉన్న ఎనిమిది మంది ఎమ్మేల్యాలకు, పార్టీ వర్గాలకు , కార్యకర్తలకు పెద్ద తలనొప్పిగా తయారైంది. వీరందరకి సయోద్య కుదర్చి ఒక్కతాటిపైకి తేవడం బొత్స సత్యనారాయణకు సాద్యమయ్యే పనేనా అని పార్టీవర్గాలు ఎవరికి తెలిసిన అంచనాలు వారు వేసుకుంటున్నారు.