ఎన్నికల కోడ్ పెద్దిరెడ్డికి వర్తించదా?

 మంత్రి పెద్దిరెడ్డి మంచీ చెడూ, ఉచ్ఛం, నీచం వదిలేశారు. ఎన్నికల నిబంధనలను తుంగలోకి తొక్కి పోలింగ్ రోజున కూడా ఓటర్లను ప్రలోభ పెట్టేలా  వ్యాఖ్యలు చేశారు.  యర్రాతివారిపల్లి 187 నంబర్ పోలింగ్ బూత్‌లో పెద్దిరెడ్డి ఓటు వేశారు. ఆయన ఓటు వేసిన తరువాత బయటకు వచ్చి మీడియాతో మాట్లాడుతూ తాను వైసీపీ గుర్తుకు ఓటు వేశానంటూ బాహాటంగా ప్రకటించారు. ఆయన ఆ మాట చెప్పక పోయినా పెద్దిరెడ్డి మరో పార్టీకి ఓటు వేశారని ఎవరూ అనుకోరు.

కానీ ఆయన తాను ఫ్యాన్ గుర్తుకు ఓటుశానని వేలిపై ఇంకు గుర్తు చెబుతూ ప్రకటించడం ఎన్నికల నిబంధనల ఉల్లంఘనే అవుతుంది. పోలింగ్ బూత్ ల వద్ద పార్టీ గుర్తుల ప్రస్తావన చేయడం నిషేధం, నిషిద్ధం. మంత్రి హోలాలో ఉన్న పెద్ద రెడ్డి ఇలా తాను ఫ్యాన్ గుర్తుకు ఓటేశానంటూ బాహాటంగా చెప్పడంతో ఆయన నిబంధనలను తుంగలోకి తొక్కారు. ఇక ఆయన సొంత నియోజకవర్గం పుంగనూరులో  ఈ తెల్లవారు జామునుంచే వైసీపీ దౌర్జన్యాలూ, కిడ్నాపులు, దాడులకు తెగబడింది.  

 పెద్దిరెడ్డి సొంతూరు సమీపంలోని  బూరగమాందలో వైసీపీ నేతలు   పోలింగ్ కేంద్రానికి వెళుతున్న ఐదుగురు తెలుగుదేశం ఏజెంట్లను, మరో పదిమంది తెలుగుదేశం నాయకులను వైసీపీ కిడ్నాప్ చేసి పీలేరు శివారులలో వదిలిపెట్టారు. మధ్యాహ్నం ఒంటిగంట వరకూ మీరు పోలింగ్ కేంద్రాల్లో ఏజెంట్‌గా కూర్చోవడానికి వీల్లేదంటూ బెదరించారు.  

Teluguone gnews banner