హస్తినలో కుర్చీలాట
posted on Aug 24, 2012 @ 9:06PM
పిసీసీ పీఠం ఖాళీ అవుతుందన్న ఊహాగానాలు ఊపందుకున్నకొద్దీ ఆ కుర్చీని దక్కించుకోవాలని తాపత్రయపడేవాళ్ల ప్రయత్నాలు పెరిగిపోతున్నాయి. చిరంజీవికి పీసీసీ పీఠం అప్పజెబితే బాగుంటుందంటూ కొందరు ప్రచారం చేసేస్తున్నారు. చిరుకే సీటు దక్కే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని, పీసీసీ పీఠం దక్కితే రాజ్యసభకు రాజీనామా చేస్తారని అభిమానులు అప్పుడే లెక్కలేసుకుంటున్నారు. వాస్తవానికి సీనియర్ హ్యాండ్ రఘువీరాకే సీటు దక్కే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని
రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. మరోపక్క రేసులో తనుకూడా ఉన్నానంటూ పాలడుగు యమా స్పీడ్ గా ప్రయత్నం
చేసుకుంటున్నారు. అభిమానులు తనని పీసీసీ పీఠంపై చూడాలనుకుంటున్నారంటూ పాలడుగు అధిష్ఠానం దగ్గర సొంతడబ్బా తెగకొట్టేసుకుంటున్నారు. వ్యవసాయ శాఖమంత్రి కన్నా లక్ష్మీ నారాయణ పేరుకూడా ప్రచారంలోఉన్న ప్రాబబుల్స్ లిస్ట్ లో ఉంది.