ఏటి సేస్తాం!
posted on Aug 24, 2012 @ 8:53PM
పీసీసీ అధ్యక్షుడు సత్తిబాబు ప్రస్తుతం పీకల్లోతు వైరాగ్యంలో మునిగితేలుతున్నారు. పదవి ఉంటుందో, ఊడుతుందో తెలీని పరిస్థితిలో తీవ్రమైన మానసిక ఒత్తిడిని ఎదుర్కుంటున్నారు. ఈ విషయమై ఎవరు కదిలించినా చిర్రుబుర్రులాడుతున్నారు.
చివరికి ఏమౌతుందోనన్న ఉత్కంఠను స్వయంగా బొత్సకూడా భరించలేకపోతున్నారు. తనకీ దుస్థితి కలగడానికి పూర్తిగా ముఖ్యమంత్రే కారణమంటూ కనిపించినవాళ్లదగ్గరల్లా బొత్స బాధను వెళ్లబోసుకుంటున్నారన్న వార్తలు హస్తిన వీధుల్లో చక్కర్లు కొడుతున్నాయి. అసలు తనకు పీసీసీ అధ్యక్షపీఠం దక్కుతుందని కలలో కూడా ఎప్పుడూ ఊహించలేదని, కాబట్టి ఇప్పుడది ఉన్నా, ఊడినా పెద్ద తేడాయేం లేదని బొత్స అందరితో చెప్పుకుంటున్నట్టు సమాచారం. రేపు పదవిపోతే తలెత్తుకుని ఎలా
తిరగాలా అని తెగ ఆలోచించి బొత్స ఈ ట్రెండ్ ని ఫాలో అవుతున్నారని కొందరు సీనియర్లు గుసగుసలాడుకుంటున్నారు. సత్తిబాబుకి
ఎలా అయినా కాస్త ముందు చూపు ఎక్కువే మరి.