పవన్ కళ్యాణ్ రాంబాబుకు ఏడు కట్‌లు

 

కెమెరామెన్‌ గంగతో రాంబాబు చిత్రానికి 7 కట్స్ సూచిస్తూ ఆ చిత్రంపై ప్రభుత్వం నియమించిన కమిటీ నిర్ణయం తీసుకుంది. చలనచిత్ర అభివృద్ధి సంస్థ మేనేజింగ్‌ డైరెక్టర్‌ ఆర్‌వి చంద్రవదన్‌, ఫిల్మ్‌ చాంబర్‌ అధ్యక్షుడు తమ్మారెడ్డి భరద్వాజ, ఐఎఎస్‌ అధికారి చందనా ఖాన్‌, దర్శకులు ఎన్‌.శంకర్‌, అల్లాని శ్రీధర్‌, తెలంగాణ ఫిల్మ్‌ చాంబర్‌ అధ్యక్షుడు విజయేందర్‌ రెడ్డి, సీనియర్‌ పాత్రకేయుడు అల్లం నారాయణ, చిత్రం నైజాం డిస్ట్రిబ్యూటర్‌ దిల్‌ రాజాలతో కూడిన కమిటీని ఏర్పాటు చేశారు.చంద్రవదన్‌తో పాటు అల్లాని శ్రీధర్‌, విజయేం దర్‌రెడ్డి, దిల్‌ రాజా తదితరులు ఈ చిత్ర ప్రివ్యూను పరిశీలించారు. మిగిలిన సభ్యులు ఈ కార్య క్రమాన్ని బహిష్కరించారు. తెలుగు తల్లి అన్న పదాన్ని, తెలంగాణ ఇవ్వడానికి ఇష్టం లేదా?, నీకో తల్లి- నాకో తల్లి అంటూ చెప్పిన డైలా గు, ఓ సన్నివేశంలో నిజాం నవాబు బ్యాక్ గ్రౌండ్ ఫోటో తో పాటు పలు పదాలు అభ్యంతరకరంగా ఉన్నాయని కమిటీ నివేదికలో పేర్కొంది.



కమిటీ సూచించిన కట్స్…
1. తెలుగుతల్లి మీద డైలాగ్ 2.లీడర్ స్టేయింగ్ ఇన్ ద ఢిల్లీ గెస్ట్ హౌస్ 3. బ్యాక్ గ్రౌండ్‌లో నిజాం ఫొటో 4. తెలంగాణ కావాలా వద్దా ..డిస్కషన్ సీన్ 5.ఎస్సీ, బీసీ హాస్టల్స్‌లో ఉన్న విద్యార్థులు ఉద్యమంలో పాల్గొంటున్నారు.. డైలాగ్ 6. యువత ఆత్మహత్యలు.. దృశ్యం 7. వేరే రాష్ట్రం నుంచి వచ్చిన సెటిలర్స్ రెచ్చగొడుతున్నారు.

తెలంగాణ ఎన్నికల్లో కేరళ స్టోరి ప్రచారాస్త్రం

ఇటీవలె కర్ణాటకలో బిజెపి ఘోర పరాజయం చెందిన తర్వాత  కూడా వాళ్ల వైఖరిలో మార్పు రాలేదు అని వెల్లడౌతుంది.  కాంగ్రెస్ మేనిఫెస్టోలో తాము మళ్లీ అధికారంలో వస్తే భజరంగ్ దళ్ పై ఉన్న నిషేధం అమలు చేస్తామని పేర్కొనడంతో కర్ణాటక ఫలితాలను ప్రభావితం చేసింది. ఒక దశలో కాంగ్రెస్ మేనిఫెస్టో ను బిజెపి కార్యాలయంలో ప్రెస్ మీట్ పెట్టి చించివేశారు బిజెపి నేతలు. భజరంగ్ దళ్ ను నిషేధిస్తే భజరంగ్ దళ్ పల్లెత్తు మాట అనలేదు కానీ బిజెపి నేతలు మాత్రం చొక్కాలు చింపుకున్నంత పని చేశారు.  తెలంగాణా రాష్ట్రంలో కూడా బిజెపి మతోన్మాదాన్ని రెచ్చగొట్టే ఫార్ములా అమలు చేయబోతుందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.  వచ్చే అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో యువ ఓటర్లను ఆకర్షించడానికి వివాదాస్పద ‘‘ ది కేరళ స్టోరి’’ సినిమా స్క్రీన్స్ వేయాలని యోచిస్తోంది. ఇటీవలె ఆదిలాబాద్ జిల్లా బిజెపి ఈ సినిమా ప్రత్యేక షో వేసారు. తెలంగాణలో హిందూ ఓటర్లను ఆకర్షించడానికి బిజెపి పన్నాగాల్లో ఈ సినిమా ఒక ప్రచారాస్త్రంగా నిలిచింది. ఆదిలాబాద్ జిల్లాలోని మారుమూల గ్రామాల్లో స్క్రీన్లు వేసి లవ్ జిహాద్ అంశాన్ని ప్రజలకు తెలియజేస్తామని బిజెపి నేతలు చెబుతున్నారు. హిందూ యువతులు లవ్ జిహాద్లో పడకూడదన్న ఉద్దేశ్యంతో ఈ సినిమాను గ్రామ గ్రామాన ప్రదర్శిస్తామని ఆదిలాబాద్ జిల్లా బిజెపి అధ్యక్షులు పాయల్ శంకర్ తెలిపారు. కేరళ స్టోరీలో 32,000 హిందూ అమ్మాయిలు కనిపించకుండాపోయి టెర్రరిస్ట్ గ్రూప్ అయిన ఐసిస్ లో  చేరతారు. తెలంగాణలో 119 నియోజకవర్గాల్లో ఎన్నికలు జరగనున్నాయి. బిఆర్ఎస్, బిజెపి, కాంగ్రెస్, ఎంఐఎం పార్టీలు అభ్యర్థులను నిలబెట్టనున్నాయి.